Farmers weep ..!

కర్షకులకు కన్నీళ్లే..! 

Date:26/03/2020

శ్రీకాకుళం ముచ్చట్లు:

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పత్తి పంటతో రైతన్న కుదేలవుతున్నాడు. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పంట ఈ ఏడాది అన్నదాతకు కష్టాన్నే మిగిల్చింది.

ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లావేరు

మండల పరిధిలో ఉన్న అదపాక, బుడుమూరు, గుర్రాలపాలెం, పెద్దకొత్తపల్లి, బెజ్జిపురం, బుడతవలస, గురుగుబిల్లి, గోవిందపురం, వెంకటాపురం, ఇజ్జాడపాలెం, మురపాక, సీహెచ్‌.అగ్రహారం, చిన్నయ్యపేట,

తదితర గ్రామాల్లో ఖరీఫ్‌లో సుమారు 4 వేల ఎకరాల్లో పత్తి పంటను వేశారు. అప్పటి నుంచి తీసిన పత్తి ఇళ్లకే పరిమితమయ్యింది. సరైన మద్దతు ధర వస్తే అమ్ముకుందామని కొందరు ఎదురుచూస్తుంటే,

మరికొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల దళారులను నమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాజాంలో ఏర్పాటు చేసింది. అక్కడికి 40-50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎలాగోలా

రవాణా ఛార్జీలు భరించి కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లినా వివిధ కారణాలతో అధికారులు కొర్రీలు వేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.5,500 ప్రకటించినప్పటికీ రైతులు సాగు చేసిన పత్తిని కొనుగోలు

చేయడానికి ముందుకు రావడం లేదని రైతన్నలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు అడిగిన ధరకే ఇళ్లల్లో నిల్వ చేసిన పత్తి పంటను

అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎకరా పొలంలో పత్తి పంట సాగు చేయడానికి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు సుమారు 6 నుంచి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి

వస్తుంది. అలా వచ్చిన పంటను అమ్ముకుందామంటే సరైన ధర లేకపోవడంతో మూడు నెలలుగా ఇళ్ల వద్దే నిల్వ చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ప్రైవేటు వ్యాపారులకు పత్తి పంటను

అమ్ముకొంటున్నారు. దళారులు క్వింటాకు రూ.3,200 నుంచి రూ.3,900 కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వం ధరతో పోల్చుకుంటే క్వింటాకు రూ.1600 వరకూ నష్టం వాటిల్లుతుందని ఆందోళన

వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి నష్టపోయిన వారిని ఆదుకోవాలని

కోరుతున్నారు.ఆచరణేది..? 

Tags: Farmers weep ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *