ధర పలకని బంతిపూలు-కాలువలో పోసిన రైతులు
రాజమండ్రి ముచ్చట్లు:
కర్నూలు నుంచి పువ్వులు తెచ్చి కడియపు లంక కాలువలో పారబో స్తున్నారు. నిలకడ లేని పూల ధరలతో రైతులు లబోదిబోమంటున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూల ధరలకు రెక్కలు వచ్చిన సం గతి తెలిసిందే.అయితే మార్కెట్లో పూలను కొనేవారు లేక కాలవలోను,చె త్తకుప్ప ల్లోనూ పారబోసిన తీరు అందర్నీ ఆశ్చ ర్యపరుస్తుంది. అలాగని ఈ పువ్వులు పక్క ఊరు నుంచి లేదా పక్క మండ లం నుంచి తీసు కొచ్చినవి కాదు. ఎక్కడో కర్నూలు,చిత్తూరు తదితర జిల్లాల నుంచి తూర్పుగోదావరి జిల్లా కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు తీసుకువచ్చి బేరాలు లేక పారబోయాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది. కొనుగోలుదారులు అధికం గా ఉండడం వల్ల బుధ,గు రువారాల్లో కేజీ 40 నుంచి 70 రూపాయలు పలక డంతో ఈ బంతి పూలను టన్నుల కొలది కడియపు లంక మార్కెట్ కు తీసుకొ చ్చారు.సుదూర ప్రాంతాల నుండి తీసు కొచ్చిన ఈ బంతి పువ్వుల ధరలు తగ్గు ముఖం పట్టాయి. సాయంత్రం అయ్యేసరికి కొనేవారే లేకపోయారు. దీంతో ఆ పువ్వులకు మచ్చలు వచ్చి పాడైపోవడంతో ఇలా కాలువలో పారబోయవలసి వచ్చిందని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా నుంచి బంతిపూలను వ్యాన్లో కడియపులంక తీసు కొచ్చామని తీరా ఇక్కడ కొనే వారు లేకపోవడంతో కాలువలో పారి పోసినట్లు నాగేశ్వర రెడ్డి అనే రైతు వాపోయారు.
Tags: Farmers who poured the price tag into the marigold-canal

