ఫరూక్ కి  పేషీ దక్కలేదు

Farooq did not get enough

Farooq did not get enough

 Date:20/11/2018
విజయవాడ ముచ్చట్లు:
ఫరూక్…. నిన్నటి దాకా శాసన మండలి ఛైర్మన్ గా ఉన్న సీనియర్ టీడీపీ నేతకు ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో వైద్య ఆరోగ్య శాఖ దక్కింది. దాంతో పాటు మైనారిటీ శాఖను కూడా సీఎం దయతో ఫరూక్ కి ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం తర్వాత ఫరూక్ తన పేషికి వచ్చారు. ఇన్నాళ్లు ఆయనకు సొంత పేషీ లేకపోవడంతో ఎక్కడ కూర్చోవాలో తెలీక మౌనంగా ఉండి పోయారు. ఎట్టకేలకు తనకో పేషీ దక్కడంతో అందులో కొలువు దీరేందుకు సచివాలయం వచ్చారు. ఉదయం 10.45కు ముహూర్తం పెట్టుకుని పేషికి వచ్చారు.తీరా మంత్రి వచ్చినా ఆయన శాఖకు సంబంధించిన అధికారులు ఎవరు అక్కడ లేరు. వైద్య ఆరోగ్య శాఖను ముక్కలు చేసి ఆయనకు కేటాయించడంతో వాళ్ళు ఆయన వైపు చూడలేదు. మైనార్టీ శాఖ వాళ్ళు ఆరోగ్య శాఖ వాళ్ళు వెళ్తారులే అని వదిలేసారు. మంత్రిగా కుర్చీలో కూర్చుని ఏమి చేయాలో తెలీక.., మీడియా వాళ్ళను మధ్యాహ్నం రమ్మని అప్పుడు మాట్లాడతా అని మంత్రి బతిమాలు కోవాల్సి వచ్చింది.అప్పటి దాకా వేచి ఉండి, ఆయన ఏదొకటి మాట్లాడతరని వెళితే…. ఇక్కడ అంతా ఎవరో లేడీ డాన్ పెత్తనం నడుస్తోంది అట…. మీకేమైనా తెలుసా అని మంత్రి అడిగే సరికి మీడియా బిత్తరపోయింది . మంత్రి తెలిసి ఆడిగారా తెలియక ఆడిగారా అన్నది ఎవరికి అర్థం కాలేదు. వైద్య ఆరోగ్య శాఖను ముక్కలు చేసి ఇద్దరికి పంచితే, ఇంకో మంత్రి శ్రవణ్ ఆయనతో పాటు రాలేదు. ఏడాదిగా సీఎం పర్య వేక్షణలో ఉన్న శాఖ కావడంతో ఆ శాఖ అధికారుల్లో డైరెక్ట్ టూ సీఎం అనే భావన ఉంది. ఫరూక్ లాంటి సీనియర్ మనసులో ఫీలింగ్…. బయట పెట్టకున్నా ఆయన అక్కసు అర్థమై మీడియా మౌనంగా నిష్క్రమించింది.
Tags:Farooq did not get enough

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *