Fast Track Courts in UP

యూపీలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Date: 09/12/2019

లక్నో ముచ్చట్లు:

ఉన్నావ్‌ అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడానికి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఉన్నావ్‌ బాధితురాలు మరణానంతరం ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు ఆయోద ముద్ర వేసింది. ఈ క్రమంలో.. అత్యాచారం కేసులను విచారించడానికి 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులను విచారించడానికి 74 కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

 

 

 

 

 

 

 

ఏడుగురు పోలీసులపై వేటు

ఉన్నావ్‌ అత్యాచారం, హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులపై ఉత్తర ప్రదేశ్‌ సర్కార్‌ వేటు వేసింది. ఈ ఘటనలో నిర్తక్ష్యంగా వ్యవహరించిన ఉన్నావ్‌  పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ త్రిపాఠితోపాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ విక్రాంత్ వీర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిని నిందితులు అడ్డుకుని దాడిచేసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన బాధితురాలు శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మృతురాలి కుటుంబం డిమాండ్‌ మేరకు బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు లక్నో డివిజనల్ కమిషనర్ ముఖేష్ మెష్రం ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.

 

వెంటనే శిక్షిస్తేనే భయం వస్తుంది

 

Tags:Fast Track Courts in UP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *