Faster RR shooting

వేగంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్

Date:12/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘RRR’ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాజమౌళి క్షణం తీరిక లేకుండా రాత్రింబవళ్లు షూటింగ్ చేస్తున్నారని చిత్ర యూనిట్‌కు చెందిన కొంత మంది ద్వారా తెలిసింది.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. షూటింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. పగటి పూట రామ్ చరణ్‌తో షూటింగ్ చేస్తున్న జక్కన్న.. రాత్రిళ్లు జూనియర్ ఎన్టీఆర్‌పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అయితే, ఈ షెడ్యూల్ తరవాత ఎన్టీఆర్‌కు కొన్ని రోజులు విశ్రాంతి ఇస్తారట. ఈ సమయంలో కోకాపేట్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో రామ్ చరణ్‌తో ఒక షెడ్యూల్ చేయనున్నారని సమాచారం. ఈ షూటింగ్ పగటి పూటే ఉంటుందని తెలిసింది.భారీ బడ్జెట్‌తో బహుబాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించడానికి బాలీవుడ్ స్టార్స్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. అలియా భట్, అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

డౌన్ ట్రెండ్ లో బంగారం

 

Tags:Faster RR shooting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *