రైలు బోగీల్లో ఘోర అగ్నిప్రమాదం
-నలుగురి మృతి
మధురై ముచ్చట్లు:
తమిళనాడు రాష్ట్రంలోని మధురై రైల్వే స్టేషన్ లో రైలు బోగీల్లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మధురై రైల్వే స్టేషన్కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు మరణించారు. రైలు ఐఆర్సిటీసీ నిర్వహిస్తున్న తీర్దయాత్రల స్పెషల్ గా లక్నో నుంచి రామేశ్వరం వెళుతోంది. ప్రయాణికులు తీసుకువచ్చిన గ్యాస్ సిలిండర్ లో ప్రమాదం వాటిల్లిందని రైల్వే అధికారులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటరనలో దాదాపు ఇరవై మందికి గాయాలయ్యాయని సమాచారం. క్షతగాత్రులను స్థానిక రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని వైద్యుల సమాచారం.

Tags: Fatal fire in train carriages
