ఒరిస్సా ఖుర్దా లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు
అక్కడికక్కడే నలుగురు మృతి
గురువారం తెల్ల జామున దుర్ఘటన
విశాఖపట్నం ముచ్చట్లు:
ఒరిస్సా రాష్ట్రం ఖుర్దా రోడ్డు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది .ఆగి ఉన్న లారీని వెనకనుంచి కారు ఢీకొన్న సంఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటనలో విశాఖకు చెందిన నలుగురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అందులో నగరంలోని బీచ్ రోడ్డు ప్రాంతానికి చెందిన బ్యూటీషియన్ మారియా ఖాన్(24), విశాలాక్షి నగర్ ప్రాంతానికి చెందిన రాఖి(45), ఫోటోగ్రాఫర్ కబీర్ తో పాటు మరో వ్యక్తి చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం .ఈ నలుగురు భువనేశ్వర్ లోని ఓ వివాహానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సంఘటన గురించి తెలిసిన వెంటనే మృతుల బంధువులు స్నేహితులు హుటాహుటిన ఖుర్దాకు బయలుదేరి వెళ్లారు.

Tags: Fatal road accident in Orissa Khurda
