నకిరేకల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
–ఇద్దరు మృతి… ముగ్గురికి గాయాలు
నల్గోండ ముచ్చట్లు:
నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి సూర్యాపేటకు వస్తున్న కారు ఇను పాముల బైపాస్ జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని ఫల్టీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు. మృతులు తల్లి కొడుకులు ఫణి కుమార్(43 )కరుణ (70)గా గుర్తించారు. ఫణి కుమార్ భార్య కృష్ణవేణి ,పాప , మరొకరికి గాయాలు అయ్యాయి. వీరంతా సూర్యాపేట పట్టణం విద్యానగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబ సభ్యులు. ప్రమాద దాటికి కారులో మంటలు చెలరేగాయి. వెనక నుండి వస్తున్న వాహనదారులు గుర్తించి బాధితులను కారులో నుంచి సకాలంలో బయటికి తీయడంతో మృతుల సంఖ్య తగ్గింది. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. అక్కడినుంచి హైదరాబాద్ కు పంపించారు.

Tags: Fatal road accident on Nakirekal National Highway
