ఘోర రోడ్డు ప్రమాదం

బెంగళూర్ ముచ్చట్లు:


కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌ దగ్గర తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. బెంగళూరుకు ఇంకా వంద కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలిసింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా మరో 30 మందికి గాయాలయ్యాయి.డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బస్సు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టిందని స్థానికులు, ప్రయాణికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో చనిపోయిన ఇద్దరు గుంటూరుకు చెందిన దంపతులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు… ఇది స్లీపర్ కోచ్.. తెల్లవారు జామున బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఊహించని ప్రమాదం జరిగింది.

 

Tags: Fatal road accident

Leave A Reply

Your email address will not be published.