రోడ్డు ప్రమాదంలో తండ్రికొడుకులు మృతి
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. తల్లి కూతురుల పరిస్థితి విషమంగా వుంది. పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సూపరెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ మడే రమేష్, అతని భార్య ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి ప్రసన్న లు ఇద్దరు పిల్లలుతో కలిసి విశాఖ నుండి పలాస వస్తుండుగా కార్ ప్రమాదం జరిగింది. జిల్లాలోని నందిగామ మండలం పెద్దినాయుడు పేట గ్రామ 16వ నెంబర్ జాతీయ రహదారి పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వస్తున్న లారీ కారును డీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. కారులో ముందు సీట్లులో ఉన్న తండ్రి కొడుకులు ఘటనా స్థలంలో మృతి చెందారు. తల్లి కుమార్తెల పరిస్థితి విషమం వుంది. అత్యవసర వైద్యo కోసం తల్లి కుమార్తె ను విశాఖ తరలించారు.
Tags: Father and son died in a road accident