Natyam ad

కుమారైను ఇంటికి తీసుకొస్తూ తండ్రి మృతి-ద్విచక్రవాహనాలు ఢీ

పుంగనూరు ముచ్చట్లు:

దసరా సెలవులు రావడంతో చదువుతున్న కుమారైను ఇంటికి తీసుకొస్తూ మార్గమ్యధ్యంలో ప్రమాదంలో తండ్రి మృతి చెందిన సంఘటన పలువురిని కలిచివేసింది. పెద్దపంజాణి మండలం మాదనపల్లెకు చెందిన మజ్జిగ నారాయణ(46) ద్విచక్రవాహనంలో కురబలకోటకు వెళ్లి తొమ్మిదవ తరగతి చదువుతున్న తన కుమారై మాన్యశ్రీ ని హాస్టల్‌ నుంచి పిలుచుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. పుంగనూరు సమీపంలోని రాజులూరు వద్దకు రాగా ఎదురుగా గంగవరం మండలానికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి తన ఇద్దరు కుమారైలను తీసుకుని ద్విచక్రవాహనంలో మదనపల్లె వైపు వస్తుండగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నారాయణకు తీవ్రగాయాలైంది. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అలాగే భాస్కర్‌, ఆయన కుమారైలు ఇద్దరికి, మృతుడి కుమారై మాన్యశ్రీ కి స్వల్పగాయాలైంది. కాగా నారాయణకు ముగ్గరు కుమారైలు. ఈ సంఘటనతో వారికుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Post Midle

Tags: Father died while bringing his daughter home – two-wheeler collided

Post Midle

Leave A Reply

Your email address will not be published.