హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత..
చెన్నై ముచ్చట్లు:
ప్రముఖ వ్యవసాయశాఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. మంకొంబు సాంబశివన్ స్వామినాథన్(98) గురువారం చెన్నైలోని తన నివాసం ఉదయం 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎం ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు. దాని ద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయ గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి ఎంతో సహాయపడింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్ ఉన్నారు.

Tags: Father of Green Revolution MS Swaminathan passed away..
