తండ్రి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య

Date:08/08/2020

కడప ముచ్చట్లు:

కడప జిల్లా ప్రొద్దుటూరు వైయం.ఆర్ కాలనీలో విషాదం నెలకొంది. రైతు బాబురెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు అయన  సెల్ఫీ వీడియో రికార్డ్ చేసాడు. తన చావుకు అల్లుడు సురేష్ రెడ్డి కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. అల్లుడు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ..తనకి న్యాయమూర్తి న్యాయం చేయాలని సెల్ఫీ వీడియో లో కోరాడు. తన తండ్రి చావుకు కారణం తన భర్తేనని తెలిసి రైలుకింద పడి కుమార్తె స్వేతా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. అక్క చనిపోయిందని చెల్లెలు ఇంజినీరింగ్ విద్యార్థిని సాయి కుడా ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు రాణి పేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఇద్దరి మృతదేహాలు కనుగొన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామాంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ 

Tags:Father, two daughters commit suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *