Natyam ad

తండ్రి మ‌ద్ద‌తు కాదు.. ప్ర‌జాభిమానం కావాలి– లోకేష్ కి విజ‌య‌సాయి హిత‌వు

విశాఖపట్నం ముచ్చట్లు:


టీడీపీ యువనేత లోకేష్‌ జనం గొంతుగా మారాలంటే తండ్రి చంద్రబాబునాయుడు మద్దతు ఒక్కటే సరిపోదని, ముందుగా ప్రజల విశ్వాసం పొందాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం గత 44 నెలలుగా అందిస్తున్న జనరంజక పాలన- అసాధ్యమనుకున్న ఎన్నో ప్రజాహిత చర్యలను సుసాధ్యం చేస్తోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలూ గరిష్ఠ సంతృప్త స్థాయిలో జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే, 2019లో ప్రజలు తిరస్కరించిన తెలుగుదేశం నేడు దిక్కుతోచని స్థితికి చేరిందని చెప్పారు. రాజకీయ చౌరాస్తాలో నిలబడి గమ్యం కనబడని దిశగా అడుగులేస్తోందన్నారు.

 

 

అందుకే, ఎలాగైనా ప్రజలకు వరసగా కొన్ని వారాలు కనపడడానికి టీ-డీపీ అధినేత కుమారుడు నారా లోకేశ్‌ పాదయాత్రకు దిగుతున్నాని చెప్పారు. జనం మధ్య నడవడానికి తెగ ప్రయాస పడుతున్నాడని అన్నారు. ఈ సందర్భంగా అతను ప్రజలకు రాసిన లేఖలో ఇచ్చిన హామీలు హాస్యాస్ప దంగా ఉన్నాయన్నారు. అసలు సమస్యలే లేని రాష్ట్రంలో వాటి పరిష్కారానికి సారథి అవుతానని లోకేశ్‌ ఈ లేఖలో హామీ ఇచ్చాడని అన్నారు. పేద, సామాన్య ప్రజానీకం మేలు అంటేనే పట్టని ఈ ‘యువనేత’ తాను సకల జనుల గొంతుక అవుతానని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ముందు ఈ పాదయాత్ర పుణ్యమా అని అఖిలాంధ్ర ప్రజనీకం గురించి చినబాబు తెలుసుకుంటే చాలున్నారు.

 

Post Midle

Tags; Father’s support is not necessary.. People’s love is needed – Vijaya Sai Hitavu for Lokesh

Post Midle