విద్యార్థులకు టాలెంట్‌టెస్ట్

Date:21/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని ఆరడిగుంట ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు టాలెంట్‌టెస్ట్ నిర్వహించారు. ఆదివారం వీడిఎఫ్‌ సంస్థ తరపున టాలెంట్‌ టెస్ట్ నిర్వహించగా 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ముగ్గరు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచడంతో సంస్థ ప్రతినిధులు వారికి నోట్‌ పుస్తకాలు, విద్యాసామాగ్రీని ఉచితంగా అందజేశారు.

 లయన్స్ క్లబ్ కు ఎక్స్ లెన్ సి అవార్డు

Tags: TalentTest for Students

అమ్మ ఒడికి పెద్ద ఎత్తున నిధులు

Date:12/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకంగా పిలవబడే ఈ స్కీమ్ నవరత్నాల్లో కీలకమైనది. పిల్లలకు బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని జగన్ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది.

 

 

 

డబ్బులు లేక ఓ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతోనే ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద రూ.15వేలు అకౌంట్లో జమ చేస్తామన్నారు. ఈ పథకాన్ని ముందుగా 1-10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీని ద్వారా 43మంది లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

 

 

 

 

ఈ స్కీమ్‌కు ముఖ్యమంత్రి జగన్ పేరు పెట్టేందుకు ఆయన్ని చాలా ఒప్పించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించడం వెనుక ‘అమ్మఒడి’ పథకం పాత్ర ఎంతో ఉంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ప్రస్తుతం బడ్జెట్లలో ఈ పథకానికి ఏకంగా రూ.6,455.80కోట్లు కేటాయించారు.

 

 

విద్యా రంగానికి సంబంధించి కేటాయింపులిలా..
⇨ విద్యాశాఖ: రూ.32,681.46 కోట్లు
⇨ ఉన్నత విద్య: రూ.3021.63 కోట్లు
⇨ మాధ్యమిక విద్య: రూ.29,772.79 కోట్లు
⇨ జగన్ అన్న విద్యా దీవెన పథకం: రూ.4962 కోట్లు
⇨ వైద్య ఆరోగ్యం: రూ.11399.23 కోట్లు
⇨ మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు.

టార్గెట్ బాబుగా అడుగులు

Tags: A large amount of funding for Mother Odi

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల నోటిఫికేషన్‌ జారీ

Date:02/07/2019

 

అమరావతి ముచ్చట్లు:

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపట్టేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు సిద్ధమయ్యారు.ఈ నెల 8వ తేదీ వరకు ఈ వెరిఫికేషన్‌ జరుగుతుంది.ఈ మేరకు వర్సిటీ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.సర్టిఫికెట్‌ పరిశీలనకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, కాకినాడలలో సెంటర్లు ఏర్పాటు చేశారు.విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో వెరిఫికేషన్‌ జరుగుతుంది.తెలంగాణ, కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థులు విజయవాడ సెంటర్‌కు రావాల్సి ఉంది.దివ్యాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, క్యాప్‌, పోలీస్‌ పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లను కేవలం విజయవాడ ఎన్టీఆర్‌ వర్సిటీలోనే పరిశీలిస్తారు.

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది.

 

Tags: Notification for MBBS and BDS courses

ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టుకు ధరఖాస్తు చేయండి

Date:20/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని అడవినాథునికుంటలో గల ఆదర్శ పాఠశాలలో ఉపాద్యాయ పోస్టుకు అర్హులైన నిరుద్యోగులు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్‌ యోజనగాంధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఇంగ్లీష్  సబ్‌జెక్ట్ బోదించేందుకు ఎంఏ, బిఈడి, ఎంఈడి గల అర్హత కలిగి, ఆంగ్లం బోధించగల వారు తమ పూర్తి బయోడెటాతో ఈనెల 24 లోపు ధరఖాస్తు చేయాలన్నారు. 26న పాఠశాలలో వారి ప్రతిభ ఆధారంగా క్లాసుల నిర్వహణ చేపట్టి, ఎంపిక చేయబడుతుందని తెలిపారు. అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

కేసీఆర్ ను సంతృప్తి పరిచేందుకు మోడీ ముందస్తు ఎన్నికలకు అనుమతి

Tags: Price to Teachers Post at Ideal School

తెలంగాణ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Date:14/06/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలో మొత్తం 92.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మల్కాజ్‌గిరికి చెందిన మండవ హనీష్‌సత్య మొదటిర్యాంక్ సాధించగా, నాచారంకు చెందిన సూర్య ఉజ్వల్ నూకల రెండో ర్యాంక్, హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన ప్రద్యుమ్నారెడ్డి మూడో ర్యాంక్ సాధించారు.

పాకిస్థాన్‌కు మోదీ మ‌రోసారి వార్నింగ్

Tags: The Telangana iSET entrance exam results released

పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించండి

Date:14/06/2019

మహబూబాబాద్ ముచ్చట్లు:

మహబూబాబాద్ మండలం లక్ష్మీ పురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ బానోత్ మౌనిక ను పాఠశాల హెచ్ఎం బద్రు, ఉపాధ్యాయ బృందం, యువజన సంఘాలు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తుందని, సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులుతమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేలా కృషి చేయాలన్నారు.

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

Tags: Include children in government schools

ఘనంగా చదువుల పండుగ

-.అందరికి విద్య మనందరి బాధ్యత
– .ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

 

Date:14/06/2019

కొల్లాపూర్  ముచ్చట్లు:

కొల్లాపూర్ లో ప్రో.జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం ఘనంగా జరిగింది.  స్థానిక వరిదేల ప్రాథమికొన్నత పాఠశాలలో చదువుల పండుగ కార్యక్రమం జరిగింది.  ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి   పాల్గొన్నారు.  చదువుల తల్లి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.  విద్యార్థులతో  ఎమ్మెల్యే అక్షరాభ్యాసం  చేయించారు. విద్యార్థులు కోలాటాలు వేసి అలరించారు.  విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ….ప్రో.జయశంకర్ సార్ బడిబాటలో భాగంగా చదువు పండుగలో ప్రతి ఉపాధ్యాయులు పాల్గొని పిల్లలను బడికి  తీసుకురావాలని అయన
పిలుపునిచ్చారు.  14వ తేది నుండి 19వ తేది వరకు జరిగే బడిబాట కార్యక్రమములో యూత్, యువకులు, మహిళ సంఘాలు, స్వచంద సేవా సంస్థలు పాల్గొని బడిబయట ఉన్న పిల్లలను బడికి తీసుకొచ్చి బడిలో చేర్పించాలి.  ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మీరు చదువు నేర్పి చూయించాలి.  ప్రభుత్య పాఠశాలలో కూడా నాణ్యతమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలి.

 

 

 

 

 

ప్రతి ఇంట్లో మగ, ఆడ తేడా లేకుండా పిల్లలను బడికి తీసుకురావాలి, చదువు నేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరకు ఎమ్మెల్యే ఫండ్స్, మరి కొందరి దాతల సహకారం తీసుకొని అభివృద్ధి చేద్దాం.  మీ సహకారం అవసరం ఉండాలని వారు అన్నారు.  గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బడిబాట కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు.  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు  విద్యార్థులకు వారి సొంత ఖర్చులతో స్పోర్ట్స్ పరికరాలు అందజేస్తనని అయన తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఏంఈఓ చంద్రశేఖర్ రెడ్డి,పాఠశాల ల
ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రజాసేవకు ప్రభుత్వం కట్టుబడివుంది

Tags: Festival of Excellence

కస్తూర్బాలలో ఇంటర్ ప్రవేశాలు

Date:13/06/2019

కర్నూలు ముచ్చట్లు:

బడి మధ్యలో మానేసిన బాలికల కోసం  జిల్లాలోని 53 మండలాల్లో కస్తూర్బా బాలికల విద్యాలయాలను ప్రారంభించారు. దీంతో ఎంతోమంది నిరుపేద బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. వైఎస్ ఆశయాలే స్ఫూర్తిగా పరిపాలన      సాగిస్తున్న నవ్యాంధ్ర నూతన     ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విద్యాలయల్లో సమూల మార్పు తీసుకొచ్చే క్రమంలో భాగంగా జిల్లాలోని 21 కేజీబీవీల్లో ఈ విద్యా  సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యను ప్రారంభించాలని నిర్ణయించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందు ఈ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిస్‌ మీడియంలో ఉచిత విద్యతో పాటు హాస్టల్‌ వసతి కల్పిస్తున్నారు. అయితే పదో తరగతి వరకు చదువున్న బాలికలు ఇంటర్‌ విద్యకు దూరమవుతండటంతో పాటు బాల్య వివాహాలు జరుగుతున్నా యి.

 

 

 

 

 

 

 

వారు పదితోనే ఆగకుండా ఉన్నత చదువులు చదవాలని భావించి..ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 140 కేజీబీవీలను అప్‌గ్రేడ్‌ చేసి ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సులు ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 21 కేజీబీవీల్లో మొదటి సంవ త్సరం ఇంటర్మిడియట్‌ ప్రారంభించనున్నారు. కేజీబీవీల్లో పదో తరగతి పూర్తి చేసిన బాలికలు పై చదువులకు దూరమవుతున్నారు. దూర ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలలకు పంపలేని అనేక మంది బాలికల కుటుంబ సభ్యులు వారికి బాల్య వివాహాలు చేస్తున్నారు. అలాంటి బాలికలకు కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య వరంగా మారనుంది. జిల్లాలోని 53 కేజీబీవీల్లో గత సంవత్సరం రెండు చోట్ల ఇంటర్‌ విద్య ప్రవేశ పెట్టినప్పటికీ అవసరమైన సిబ్బంది, వసతులు కల్పించక పోవడంతో ఉపయోగంలోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఇంటర్‌తో పాటు టెక్నికల్, ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టడంతో నిరుపేద బాలికలకు వరంగా మారనుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ఎన్టీయార్ తర్వాత జగనే….

Tags: Inter entries in kasturba