కస్తూర్బాలలో ఇంటర్ ప్రవేశాలు

Date:13/06/2019

కర్నూలు ముచ్చట్లు:

బడి మధ్యలో మానేసిన బాలికల కోసం  జిల్లాలోని 53 మండలాల్లో కస్తూర్బా బాలికల విద్యాలయాలను ప్రారంభించారు. దీంతో ఎంతోమంది నిరుపేద బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. వైఎస్ ఆశయాలే స్ఫూర్తిగా పరిపాలన      సాగిస్తున్న నవ్యాంధ్ర నూతన     ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ విద్యాలయల్లో సమూల మార్పు తీసుకొచ్చే క్రమంలో భాగంగా జిల్లాలోని 21 కేజీబీవీల్లో ఈ విద్యా  సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యను ప్రారంభించాలని నిర్ణయించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందు ఈ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిస్‌ మీడియంలో ఉచిత విద్యతో పాటు హాస్టల్‌ వసతి కల్పిస్తున్నారు. అయితే పదో తరగతి వరకు చదువున్న బాలికలు ఇంటర్‌ విద్యకు దూరమవుతండటంతో పాటు బాల్య వివాహాలు జరుగుతున్నా యి.

 

 

 

 

 

 

 

వారు పదితోనే ఆగకుండా ఉన్నత చదువులు చదవాలని భావించి..ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 140 కేజీబీవీలను అప్‌గ్రేడ్‌ చేసి ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సులు ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 21 కేజీబీవీల్లో మొదటి సంవ త్సరం ఇంటర్మిడియట్‌ ప్రారంభించనున్నారు. కేజీబీవీల్లో పదో తరగతి పూర్తి చేసిన బాలికలు పై చదువులకు దూరమవుతున్నారు. దూర ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలలకు పంపలేని అనేక మంది బాలికల కుటుంబ సభ్యులు వారికి బాల్య వివాహాలు చేస్తున్నారు. అలాంటి బాలికలకు కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య వరంగా మారనుంది. జిల్లాలోని 53 కేజీబీవీల్లో గత సంవత్సరం రెండు చోట్ల ఇంటర్‌ విద్య ప్రవేశ పెట్టినప్పటికీ అవసరమైన సిబ్బంది, వసతులు కల్పించక పోవడంతో ఉపయోగంలోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఇంటర్‌తో పాటు టెక్నికల్, ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టడంతో నిరుపేద బాలికలకు వరంగా మారనుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ఎన్టీయార్ తర్వాత జగనే….

Tags: Inter entries in kasturba

అమ్మానాన్నల లక్ష్య సాదన కోసమే మాదురి కృషి

– నీట్‌లో 17,201 ర్యాంకు

Date:06/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ మోహన్‌, ఆయన సతీమణి ప్రమీల దంపతుల కుమారై మాదురి, కుమారుడు త్రిలోకరాజు సైనిక పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. మాదురి చిన్నతనం నుంచి పట్టుదలతో చదివింది. ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తికాగానే నీట్‌ పరీక్షలకు హాజరై, జాతీయ స్థాయిలో 17,201 ర్యాంకు సాధించి, 567 మార్కులు పొందింది. తన తాత చెంగమరాజు ఫార్మసిస్ట్గా పనిచేస్తూ ఆకాలంలో ప్రజల మన్ననలు పొందారు. చిన్నతనం నుంచి తాత చేస్తున్న సేవలకు ఆకర్షితురాలైన మాదురి అమ్మ,నాన్నల ప్రోత్సాహంతో డాక్టర్‌ కావాలన్నది ఏకైక లక్ష్యంగా పట్టుదలతో చదవడం ప్రారంభించింది. పదిలో, ఇంటర్‌లో 10కి 10 పాయింట్లు సాధించి మేటిగా నిలిచి, నీట్‌లో వైద్య వృత్తి చదివేందుకు స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా మాదురి మాట్లాడుతూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారము, అద్యాపకులు ప్రోత్సాహంతో ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోకుండ కళాశాలలో బోదనలతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలైందని ఆమె పేర్కొన్నారు. పట్టణ ప్రముఖులు మాదురిని అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

 

Tags; Madurai’s efforts are for the sake of the goal

తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

పదోతరగతి విద్యార్థుల విజయకేతనం

Date:15/05/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదోతరగతి పరీక్షల్లో విజయ ఢంకా మ్రోగించారు. మండలంలోని మోడల్‌ స్కూల్‌లో టి.చందన 10 పాయింట్లు సాధిచింది. అలాగే టి.జవహార్‌రెడ్డి 10 పాయింట్లు సాధించారు. ఎం.అనూష , ఎస్‌.హర్షిణి 9.8 పాయింట్లు సాధించారు. ఎస్‌.అజయ్‌ , ఎం.మదుప్రియ, ఎస్‌.వినయ్‌ 9.5 పాయింట్లు సాధించారు. అలాగే ఎస్‌.ఆస్మిన్‌, ఎం.హరిణి, పి.శర త్‌కుమార్‌, ఎస్‌.మేఘన, ఏ.ద్రాక్షాయణి, ఎం.రెడ్డివర్ష 9.3 పాయింట్లు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్‌ యోజనగాంధి , ఉపాధ్యాయులు అభినందించారు. అలాగే మున్సిపల్‌ హైస్కూల్‌ మేలుపట్ల విద్యార్థులు ఎస్‌.అస్మ 10 పాయింట్లు, పి.పల్లవి , ఎల్‌.సుమన్‌ 9.7 పాయింట్లు, ఎస్‌.ఆదిల్‌బాషా, ఎం.శ్రావణ్‌కళ్యాణ్‌, గణేష్‌కుమార్‌రెడ్డి, పి.మహేష్‌, వి.మునిరాజలు 9.3 పాయింట్లతో ఉత్తీర్ణులైయ్యారు. వీరిని హెచ్‌ఎం లక్ష్మణ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. అలాగే కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌ నుంచి గిరిధర్‌, లీనార్డ్ హైస్కూల్‌ నుంచి అర్బిన్‌తాజ్‌, ప్రభుత్వ హైస్కూల్‌ నుంచి అస్మ లు 10 పాయింట్లు సాధించారు. మూడు ఉన్నత పాఠశాలల్లోను 42 మంది 9 పాయింట్లు సాధించారు. వీరిని కమిషనర్‌ మదుసూధన్‌రెడ్డి , హెచ్‌ఎం సుబ్రమణ్యం, కోఆర్డినేటర్‌ క్రిష్ణమరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.

ప్రైవేటు పాఠశాలల్లో…..

పుంగనూరు పట్టణంలోని రాయలసీమచిల్డ్రన్స్ అకాడమిలో 56 మంది విద్యార్థులలో 7 మంది విద్యార్థులకు 10 పాయింట్లు సాధించారు. వీరు గౌతమ్‌సాగర్‌, షాహిన అంజుమ్‌, నాగమయూరి, చరణ్‌తేజ, చాంద్‌సుబహాన్‌, సుభాష్‌చంద్ర, రవికిషోర్‌రెడ్డి 9.8 పాయింట్లు సాధించిన మేఘశ్యాం, భువనతేజ, హిమబిందు, మిజ్బాఫాతిమా , రెడ్డినిరంజన్‌లు ఉన్నారు. పాఠశాలలో 98 శాతం ఉత్తీర్ణులైనట్లు డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులను అభినందించారు. అలాగే క్రిష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమిలో 59 మంది విద్యార్థులకు గాను 17 మంది 10 పాయింట్లు సాధించారు. అలాగే 18 మంది 9.8 పాయింట్లు, 9 మంది 9.7 పాయింట్లు , 15 మంది 9.5 పాయింట్లు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్‌ భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. వికాస్‌ ఇం•ష్‌ మీడియం హైస్కూల్‌లో 19 మంది విద్యార్థులు పాసై, 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో దీప్తి 10 పాయింట్లు సాధించింది. నందిని, భావన 9.7 పాయింట్లు , మనోహర్‌రెడ్డి, కేశవరెడ్డి, న్యామత్‌బాషాలు 9.3 పాయింట్లు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్‌ శివశంకర్‌రెడ్డి , ఉపాధ్యాయులు అభినందించారు. ఎన్‌డిఆర్‌ విశ్వభారతి పాఠశాలలో దేవిప్రియ, హర్షిత, భవ్యశ్రీ, సాయినరసింహ, సమీరభానులు 10 పాయింట్లు సాధించారు. వీరిని కరస్పాండెంట్‌లు నవీన్‌, భరత్‌, హెచ్‌ఎం గోపికుమార్‌లు అభినందించారు.

 

75 శాతం సబ్సిడిపై విత్తనాలు పంపిణీ

 

Tags: Successful student grades

ఏపీ పదవ తరగతి ఫలితాలు వెల్లడి

-ముందంజలో బాలికలు
Date:14/05/2019
అమరావతి ముచ్చట్లు:
ఏపీ పదవ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. ఈ పరీక్షకు 6 లక్షల 30 వేల 82 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6 లక్షల 19 వేల 494 రెగ్యులర్, 10,588 ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. 94.88 శాతం రెగ్యులర్ విద్యార్థులు పాస్ అయ్యారు. బాలేనే 94.68 శాతం, బాలికలు  95.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 94.88శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రవేటు విద్యార్థుల్లో 61.84 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 51.72 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం  11,690 పాఠశాలల నుంచి  5464  స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత  సాధించాయని సంధ్యారాణి తెలిపారు. గతంలో 17 స్కూళ్లలో సున్నా పాస్ పర్సంటేజ్ ఉండగా ఈసారి అది 3 పాఠశాలలకే పరిమితమయిందని ఆమె అన్నారు.
ప్రధమ స్థానంలో తూర్పు గోదావరి జిల్లా(98.19) వుండగా, చివరి స్థానంలో నెల్లూరు జిల్లా(83.19) నిలిచింది. రెండవ స్థానం  ప్రకాశం జిల్లా (98.17),  చిత్తూరు జిల్లా ( 97.41) మూడో స్థానం, నాలుగవ స్థానంలో   విజయనగరం ( 97.28),  విశాఖ జిల్లా ( 96.37) ఐదో స్థానం,   శ్రీకాకుళం జిల్లా ( 95.58) ఆరో స్థానం,  అనంతపురం జిల్లా ( 95.55)  ఏడో స్థానం,  గుంటూరు జిల్లా ( 95.35) ఎనిమిదవ స్థానం, కృష్ణా జిల్లా (93.96) తొమ్మిదవ స్థానం, పశ్చిమ గోదావరి జిల్లా (93.29) పదవ స్థానం, కడప జిల్లా ( 92.90)  11వ స్థానం,  కర్నూలు జిల్లా ( 92.10)  12వ స్థానంలో వుంది.
మరోవైపు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు 98.24 శాతంతో మొదటి స్థానంలో ఉన్నారు. ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు 87.16 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవని సంధ్యారాణి స్పష్టం చేశారు.
Tags: AP reveals results of tenth class

19 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్

Date:13/05/2019
విజయవాడ ముచ్చట్లు:
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు గాను నిర్వహించిన ఏపీఈసెట్-2019 ఫలితాలు సోమవారం (మే 13న) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఏపీ సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఈసెట్‌ ఫలితాల్లో 37,066 మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు. వివిధ విభాగాల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థుల వివరాలను విజయరాజు ప్రకటించారు. మే 19 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు తుది ఆన్సర్ ‘కీ’ని కూడా అధికారులు విడుదల చేశారు. జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న నిర్వహించిన ఏపీఈసెట్‌-2019 పరీక్షలకు 37,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 1న ఈసెట్ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 3 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం మే 13న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.
Tags: This Counseling from 19th

14న ఏపీ టెన్త్ ఫలితాలు

Date:11/05/2019
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తేదీని అధికారులు ఖరారు చేశారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో మే 14న ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో పూర్తయింది. అయితే.. పాఠశాలల నుంచి ఇంటర్నల్ మార్కులు రాకపోవడంతో ఫలితాల ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ఇప్పటికే అధికారులకు సంబంధిత ఉపాధ్యాయుల నుంచి ఇంటర్నల్ మార్కులు అందడంతో.. ఆ మార్కులను కూడా అప్‌లోడ్ చేశారు. దీంతో మే 14న ఫలితాలను వెల్లడించనున్నారు.ఏపీలో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 6.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,839 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Tags: AP Tenth Results on 14th

జ్ఞానదార శిక్షణ వేళల్లో మార్పు

Date:07/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పదోతరగతి విద్యార్థులకు వేసవిలో నిర్వహిస్తున్న జ్ఞానధార శిక్షణా కార్యక్రమం వేళలను మార్పు చేసినట్లు కమిషనర్‌ మదుసూధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వేసవితీవ్రత అధికంగా ఉన్నందున ప్రభుత్వాదేశాల మేరకు శిక్షణ వేళలను ఉదయం 7:30 గంటల నుంచి 10:30 గంటల వరకు మార్పి చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ వేళల మార్పులను గమనించి ఉదయమే శిక్షణా తరగతులకు హాజరుకావాలెనని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్‌ రామక్రిష్ణమరాజు పాల్గొన్నారు.

 

 

సీతారామరామరాజు 95 వ వర్ధంతి వేడుకలు

Tags: Change in knowledge training