సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం

Date:14/06/2018
కర్నూలు ముచ్చట్లు:
దర్శ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిషు మాధ్యమం అమలు చేయాలని గతేడాది ప్రయత్నించినా కొన్ని పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు.  ఈ ఏడాది నుంచి ఎలాగైనా అమలు చేయాలని అధికారులు  జిల్లాలోని 2035 స్కూళ్లను ఎంపిక చేసి విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు.  ఈ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ గత నెలలో మొదటి విడత కింద జిల్లాలో 625 పాఠశాలలకు అనుమతులు ఇచ్చారు. తాజాగా మరో 812 స్కూళ్లలోనూ అమలుకు ఆదేశాలు ఇచ్చారుజిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల కింద మొత్తం 2870 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక  1927, ప్రాథమికోన్నత 389, ఉన్నత పాఠశాలలు 554 ఉన్నాయి. వీటిలో మొదటి విడత కింద 541 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, 52 ప్రైమరీ, 32 ప్రాథమికోన్నత పాఠశాలలు, రెండో విడత కింద 599 ప్రాథమిక, 213 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అమలుకు ఆదేశాలు ఇచ్చారు. మొదటి విడత కింద ఎంపిక చేసిన స్కూళ్లలో ప్రవేశాలు భారీగా కల్పించేందుకు  విద్యాశాఖ అధికారులు టీచర్లతో విస్త్రృతంగా ప్రచారం చేయిస్తున్నారు.  పాణ్యం   ఎంఈఓ కోటయ్య ప్రత్యేకంగా ఆటోకి ఫ్లెక్సీలు వేయించి మండల పరిధిలోని గ్రామాల్లో  తిప్పుతున్నారు.  ఈ ప్రచారంతో  సుమారు 60కిపైగా కొత్త అడ్మిషన్లు చేయించి జిల్లాలోని మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో ప్రచారం చేస్తే ఈ ఏడాది భారీగానే సర్కార్‌ స్కూళ్లలో ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంది. అయితే వీరికి తెలుగు మీడియం టీచర్లతోనే చదువులు చెప్పిస్తారా? లేకపోతే కొత్త  నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తారా అనేది ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి తోడు రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న జిల్లాగా  కర్నూలుకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం  అమలుకు అనుమతులు ఇచ్చారు. ఈ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంతో పాటు డిజిటల్‌ తరగతులు కూడా ఏర్పాటు చేసి ప్రైమరీ క్లాస్‌లకు ప్రత్యేకంగా నిపుణులతో తయారు చేసిన మెటీరియల్‌  ఇవ్వాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది.
Tags: English medium in circular schools

క్రమశిక్షణతో చదువులు

Date:12/06/2018
ఏలూరు ముచ్చట్లు:
క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకుంటానని నిరంతరం చదువుపైనే ధ్యాసపెట్టి మంచి విద్యద్వారా ఉత్తమ పౌరులుగా ఎ దుగుతారని ఎ మ్మెల్సీ రాము సూర్యారావు విద్యార్ధినిల చేత ప్రమాణం చేయించారు. స్ధానిక సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాలలో విద్యాసంవత్సరం ప్రారంభం సందర్భంగా మంగళవారం ఆయన విద్యార్దినిల చేత ప్రతిజ్ఞ నిర్వహించారు. సమాజంలో విద్యలేకపోతే అభివృద్ది సాథ్యం కాదని ప్రతీ మనిషీ విద్యద్వారానే ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలుగుతారని క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోగలుగుతారని సూర్యారావు చెప్పారు. విద్యలో బాలికలే టాప్ ర్యాంకులు సాధిస్తున్నారని దీనికి కారణం చిన్నప్పటినుండి చదువే ధ్యేయంగా పనిచేస్తున్నారని సూర్యారావు చెప్పారు. ఉన్నత విద్యకు డబ్బు ఆటంకం కారాదని ఎ వరికైనా ఆర్ధికంగా వెనుకుబాటుతనం ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ఉద్యోగం వచ్చేవరకూ పేదవర్గాల పిల్లలను చదివించితీరతానని సూర్యారావు చెప్పారు. ప్రతీ ఏటా 60 మంది విద్యార్ధులు తమ స్వంత ఇంటిలో ఉచితంగా చదువుకుంటారని వారికి కావాల్సిన అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నానని అయన చెప్పారు. ముఖ్యంగా ఫీజులు కట్టలేదని, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దని నిజంగా ఎ వరైనా ఫీజు కట్టలేని స్ధితిలో ఉంటే అటువంటి బాలికలు తనవద్దకు వస్తే అవసరమైన ఫీజును చెల్లించడానికి వెనుకాడబోనని ఎమ్మెల్సీ చెప్పారు. ఈకార్యక్రమంలో ఏలూరు డిప్యూటి డిఇఓ ఉదయకుమార్, సెయింట్ థెరిస్సా హైస్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు మేరీ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
Tags: Study with discipline

25 నుంచి ఎంసెట్-2018 కౌన్సెలింగ్

Date:23/05/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 25 నుంచి ఎంసెట్-2018 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎంసెట్ అడ్మిషన్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్ నిర్వహణ కోసం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి ఈ నెల 25నుంచి జూన్2 వరకు గడువు విధించారు. ఈ నెల 28 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 2018-19విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.
Tags: EAMCET -2018 counseling from 25th

కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం 

Date:27/02/2018
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
సిరిసిల్ల లోని  కేంద్రీయ విద్యాలయంలో 2018-2019 విద్యా సంవత్సరంకు గాను  ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసకోవాలని సిరిసిల్ల  కేంద్రీయ విద్యాలయం  ప్రిన్సిపల్ వేణయ్య   తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీ చేసారు . ఒకటవ తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థులు మార్చి 1,  2018 ఉదయం 08.00 గంటల నుంచి  మార్చి 19,  2018 సాయంత్రం  04.00 గంటల వరకు దరఖా స్తు లను  ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని  ప్రిన్సిపల్ వేణయ్య అన్నారు . రెండవ తరగతి  ఆపైన తరగతుల ప్రవేశం కోసం విద్యార్థులు   ఏప్రిల్  2,  2018 ఉదయం 08.00 గంటల నుంచి  ఏప్రిల్  9,  2018 సాయంత్రం  04.00 గంటల వరకు దరఖా స్తు లను  ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు .  రెండవ తరగతి  ఆపైన తరగతుల ప్రవేశం  కేంద్రీయ విద్యాలయం లో ఉన్న  ఖాళి  సీట్ల ఆధారంగా మాత్రమే  ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామన్నారు . మార్చి 31 , 2018 నాటికి ఉన్న వయస్సు ను  ప్రాతిపదికగా తీసుకొని కేంద్రీయ విద్యాలయం మార్గదర్శకాల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని  ప్రిన్సిపల్ వేణయ్య పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థులు  మార్చి 31 , 2018 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు .  ప్రవేశాలపూర్తీ వివరాలను  కేవీఅడ్మిషన్ ఆన్ లైన్ 2018 డాట్ ద్వారా పొందవచ్చునన్నారు . సీట్ల రిజర్వేషన్ కేంద్రీయ విద్యాలయ మార్గదర్శకాలు ప్రకారం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు ఆసక్తి , అర్హత గల విద్యార్థులు తల్లిదండ్రులు  సిరిసిల్ల  కేంద్రీయ విద్యాలయం ను   08723-232244 ఫోన్నెంబర్లో సంప్రదించాలని  అయన   కోరారు.
Tags: Invited applications for entrants in Kendriya Vidyalaya

19 నుంచి సర్కారీ స్టూడెంట్స్ కు నీట్, ఐఐఐటీకి ట్రైనింగ్

Date:24/02/2018
హైద్రాబాద్ర్ ముచ్చట్లు:
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు వేసవిలో నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. వచ్చేనెల 19 నుంచి ఈ శిక్షణ ప్రారంభమవుతున్నది. అందులో భాగంగానే  హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అధ్యాపకులకు ఓరియెంటేషన్‌ కార్యక్రమం నిర్వహించింది. ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఎ అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయడంలో భాగంగా కళాశాలలకు పక్కా భవనాల నిర్మాణాలు, ప్రహరీ గోడల నిర్మాణాలు, మరుగుదొడ్లు, ఫర్నీచర్‌, ల్యాబ్స్‌లో పరికరాలు, ఆట వస్తువులు సమకూర్చడం జరుగుతున్నదని చెప్పారు. బయోమెట్రిక్‌ ద్వారా హాజరు, సీసీ కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్‌లో ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల బలోపేతానికి అధ్యాపకులు కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడం కోసమే నీట్‌/జేఈఈ/ఎంసెట్‌ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జాతీయ, రాష్ట్ర ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామని వివరించారు. అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్‌ సామాజిక బాధ్యతతో కోచింగ్‌ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వచ్చేనెల 19 నుంచి ఏప్రిల్‌ 19వ తేదీ వరకు పాత పది జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఒక్కో కేంద్రంలో అబ్బాయిలు 50 మంది, అమ్మాయిలు 50 మంది చొప్పున వంద మంది ఉంటారని చెప్పారు. విద్యార్థులకు ఏప్రిల్‌ 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సాధన చేయిస్తామని అన్నారు. ప్రతి కేంద్రం నుంచి ఐదు మందిని ఎన్నుకొని పది రోజులు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తామన్నారు. నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలపై అధ్యాపకులు, సూచనలు, సలహాలు, మెళకువలు నేర్పిస్తారని చెప్పారు.
Tags: From 19th on to the Study Students Neet, Training for IITI

నిరుద్యోగులకు పాఠాలు చెప్పిన ఎస్పీ

Date:22/02/2018
మహబూబాబాద్ ముచ్చట్లు:
జిల్లాలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్న సదుద్దేశంతో జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు పోలీస్ కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షల కోసం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శిబిరాన్ని సందర్శించిన ఎస్పీ ఈ సందర్భంగా నిరుద్యోగులకు జియోగ్రఫీ సబ్జెక్ట్ను బోధించారు. అనంతరం విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. స్పీచ్తో యువతను ఉత్తేజపరిచారు. నిరుద్యోగులు కూడా రాష్ట్ర పోలీస్ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలకు సంతోషపడుతున్నారు. నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తున్న పోలీస్ వ్యవస్థకు ప్రజలు సలాం కొడుతున్నారు. హైదరాబాద్లో భాగ్యకిరణ్ కోచింగ్ సెంటర్ ద్వారా కూడా నిరుద్యోగులకు ఎస్పీ ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.మంచి ఉద్యోగాలు సాధించి జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతామని నిరుద్యోగులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ… మహబూబాబాద్, తొర్రూర్ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 500 మందికి పైగా విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సహకారం అందించిన గాయత్రి గ్రానైట్స్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక విద్యార్థి హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకోవాలంటే దాదాపు 20 వేలకు పైగా ఖర్చు వస్తున్నందున… పేద విద్యార్థులకు ఇది ఓ మంచి అవకాశం అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేష్, ట్రాఫిక్ ఎస్సై అశోక్, భాగ్యనగర్ సెంటర్ ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: SP Lessons for Unemployed

గురుకుల్ నోటిఫికేషన్ రిలీజ్: ఏప్రిల్ 8న ప్రవేశ పరీక్ష

Date:19/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల స్కూళ్లలో 5వ తరగతి ప్రవేశాలకు గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2018ను ప్రభుత్వం నిర్వహించనుంది. అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనుంది. దీని కోసం ప్రభుత్వం టీజీ గురుకుల్ సెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి అప్పగించింది.
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్థుల వయసు 01.09.2018 వరకు 9 నుంచి 11 ఉండాలి. SC,ST విద్యార్థులకు వయోపరిమితి రెండేళ్లు సడలించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లో ప్రస్తుతం 4వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకుండా ఉండాలి. టీజీసెట్.సీజీజీ.గవ్.ఇన్ వెబ్సైట్ ద్వారా అన్ లైన్లో రూ.50 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు 19 నుంచి మార్చి 16 దాకా కొనసాగుతాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థ  కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తెలిపారు. టీజీ గురుకుల్ సెట్ పరీక్ష ఏప్రిల్ 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు.
Tags: Gurukul Notification Release: Entrance test on April 8

ఇక ఇంగ్లీష్ చదువులు

Date:16/02/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
 జిల్లాలో విద్యా విధానాన్ని మార్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ఓరియెంటెడ్ చదువులకు కలెక్టర్ శ్రీకారం చుడుతునారు. ప్రాథమిక పాఠశాలల టీచర్లకు శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు ఆంగ్లంలో బోధన చేయడం, మాట్లాడించడం వంటివి చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఈ నెల 19వ తేదీ నుంచి రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆంగ్ల శిక్షణకు ఎంపిక చేసిన పాఠశాలల్లో అధికారులు బోధన కుంటుపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేస్తున్నారు. ఒకరిద్దరిని మాత్రమే శిక్షణకు పంపిస్తే ఆంగ్ల బోధన సరిగ్గా సాగదని, దీంతో లక్ష్యం నెరవేరదన్న ఆలోచన అధికారుల్లో ఉంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు అందరినీ పంపించనున్నారు. దీని కారణంగా పాఠశాల మూతపడకుండా, పరీక్షల నిర్వహణ కోసం ఇతర పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో సమీప పాఠశాలల్లో ఉపాధ్యాయులు    ఎంత మందిఉన్నారు? ఎందరిని సర్దుబాటు చేయవచ్చు అన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. దీని గురించే ఈ నెల 8వ తేదీ గురువారం ఎంఈవోలు, ఆంగ్ల ఉపాధ్యాయులతో డీఈవో సమావేశం నిర్వహించి, చర్చించారు. మొత్తంగా ఈ నెల 19 నుంచి సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.ఆంగ్లంపై ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో పరిజ్ఞానం పెంచే విధంగా శిక్షణలు ఉండబోతున్నాయి. బృంద చర్చలు, డిబెట్స్‌, నాటికల వంటి వాటితో అవగాహన కల్పిస్తారు. దీనితో పాటు విద్యార్థులకు బోధన చేసే సమయంలో తీసుకోవాల్సిన మెలకువలు, అర్థమయ్యేలా బోధన పద్ధతులు, ప్రశ్నలు సంధించి, ఆంగ్లంలో ఎలా సమాధానం రాబట్టాలి? తదితర అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌లో శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. వారంలో అయిదు  రోజుల పాటు శిక్షణ, శని, ఆదివారాలు సెలవు ఇవ్వనున్నారు. ఆ సమయంలో శిక్షణ కేంద్రంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వచ్చి మళ్లీ సోమవారం శిక్షణకు హాజరు కావచ్చు. ఎనిమిది వారాలు అయినప్పటికీ వారాంతపు సెలవులు పోను 40 రోజులు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నారు.
Tags: English readings are longer