కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి…. పిడిఎస్ యు

రాయచోటి ముచ్చట్లు:

 

జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజులు దోపిడీకి గురి చేశారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ లోని స్పందనలోడిఆర్ఓసత్యనారాయణకు  ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా కోశాధికారి జోకిశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, మదనపల్లె,పీలేరు ప్రాంతాల్లో ఫీజులు పేరుతో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు డొనేషన్ల రూపంలో లక్షలాది రూపాయలు వ్యాపారం కొనసాగించారని ఏ ఒక్క పాఠశాలలో కూడా నోటీసు బోర్డు ఫీజులు వివరాలు పట్టిక నమోదు చేయలేదని మరోవైపు 25 శాతం ఎస్సీ ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులకుఉచిత విద్య అందించాల్సి ఉండగా అమలు ఏ ఒక్క పాఠశాలలో కూడా కావడం లేదున్నారు. విద్యార్థులు సంఖ్యను బట్టి మరుగుదొడ్లు వసతులు కల్పించలేదని పలు పాఠశాలలకు అయితే ప్లే గ్రౌండ్ సౌకర్యం కూడా లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు రాయచోటి నియోజకవర్గం నాయకులు జయపాల్ రెడ్డి,గణేష్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Fee exploitation in corporate private schools should be curbed.
PDS U

Leave A Reply

Your email address will not be published.