రద్దయిన పరీక్షలకు మళ్లీ ఫీజ్ కట్టక్కర్లేదు.. కేటీఆర్
హైదరాబాద్ ముచ్చట్లు:
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీక్‌పై నిపుణులతో చర్చించామని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో రివ్యూ చేశామని తెలిపారు. పేపర్ లీక్‌పై కేసీఆర్‌కు నివేదిక ఇచ్చామని, ద్వారా 155 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. ద్వారా 37 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 10 లక్షల మందికి ఒకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత ఉందని చెప్పుకొచ్చారు.

ఇద్దరు చేసిన తప్పునకు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని, పేపర్ లీకేజీ వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. రద్దయిన పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇకపై జరిగే పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో హాజరైన వారిని అర్హులుగా గుర్తిస్తామని, కోచింగ్ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని, 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అపోహలు సృష్టించేవారిని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ తెలంగాణ యువతకు సూచించారు. ఇదిలా ఉండగా.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు నిందితులను సిట్ కస్టడీకి అప్పగించారు. 9 మంది నిందితులను 6 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది.చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను సిట్ అదుపులోకి తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలపై సిట్ కూపీ లాగనుంది. ప్రశ్నాపత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై సిట్ ఆరా తీయనుంది. నిందితులను మార్చి 23 వరకు సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.
Tags; Fee will not be charged again for canceled exams.. Kutra
