. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామజిక న్యాయం కాదు ఫ సీపీఎం

Date:14/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పై ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు  స్పందిస్తున్నారు. ఇన్ని రోజులు ఏమి చేశారు. యూపీ లో అంబెడ్కర్ విగ్రహం కూల్చడం,గులాబీ రంగు వేసినప్పుడు పీఎం ఏమి చేస్తున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు ప్రశ్నించారు. కాశ్మీర్ లో చిన్న పిల్లలను బీజేపీ వాళ్ళు అత్యాచారం చేశారు. ఏమి పాలన చేస్తున్నారు ప్రధాని అని నిలదీసారు. శనివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సపీఎం నేతలు, శ్రేణులు అంబెద్కర్ కు నివాళులు అర్పించారు. తరువాత సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మనేని సీతారాం మాట్లాడుతూ సామాజిక నాయ్యం గూర్చి కాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. గొర్రెలు బర్రెల ఇవ్వడం కాదు…సామాజిక న్యాయం. ఎస్సీ, ఎస్టీ  సబ్ ప్లాన్ల పై ప్రత్యేక చట్టం చేయాలని అన్నారు. పార్లమెంట్ ,శాసనసభ లలో అన్ని కులాల వారికి సీట్లు ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు.  65 నుంచి 70 సీట్స్ బీసీ లకు ఇస్తాం అని చెప్పారు. మంత్రుల స్థానాలు ఏ ఏ వర్గాల వారికి ఇస్తారో ముందు గానే చెప్పాలని అయన అన్నారు.
Tags:Feeding sheep and buffalos is not social justice but ff CPM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *