తెలుగు తల్లిపై ఫీట్లే

Date:16/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్: తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఆయిల్ పడిపోవడంతో శుక్రవారం ఉదయం వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి లీకైన చమురు ఫ్లై ఓవర్ మీద ఒలికిపోయింది. ఈ విషయం తెలియకుండా బైక్ మీద వేగంగా వెళ్తున్నారు జారిపడిపోతున్నారు. లక్డీ కపూల్ నుంచి ఇందిరా పార్క్ వైపు టూవీలర్స్‌ మీద వెళ్తున్న వారు ఫ్లైఓవర్ మీద తమ వాహనాలను కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. చమురు ఒలికిపోవడానికి చిరు జల్లులు తోడవంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద చమురు ఒలకిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడటం ఇదే తొలిసారి కాదు. గత జనవరిలోనూ టూవీలర్లపై వెళ్తున్నవారు ఇలాగే జారి పడిపోయారు.
Tags: Feet on Telugu mother

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *