మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

నల్లగొండ  ముచ్చట్లు :
నల్లగొండ డీఎస్పీ  ఆఫీస్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయిన కవిత అనే  మహిళ రైతును పోలీసులు అడ్డుకుని ఆసువుత్రికి తరలించారు.  నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాల్ గూడ లోని భూమి విషయంలో గత మూడు నెలలుగా బాగస్థుల మధ్య సమస్య నడుస్తోంది. బంధువులు భూమి అమ్ముకుని  కవిత కు చెందిన భూమి పైకి రావడంతో ఆర్డీవో, ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లగా సర్వే పెట్టుకోమని వారు సలహ ఇచ్చారు. సర్వే పెట్టుకుంటున్న సందర్భంలో పోలీసులు జోక్యం చేసుకుని ఆ భూమి అవతలి వ్యక్తులది అంటూ… మీరు ఈ భూమి నుండి వెళ్లిపోవాలని ఇబ్బంది పెట్టారని ఆమె ఆరోపణ. ఈ నేపధ్యంలో డిఎస్పీ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్ననికి పాల్పడింది.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Female farmer commits suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *