సీఎం రేసులో మహిళా నేతలు

Female Leaders in the Race Race

Female Leaders in the Race Race

Date:23/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హామీలు  నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే మహిళకు ముఖ్మమంత్రిని చేసే అవకాశం ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ మహిళా నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రేసులో గీతా  రెడ్డి,  డి.కె. అరుణ ఉండగా నటి   కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ విజయశాంతి కూడా నేను కూడా రేసులో ఉన్నానంటూ కాలు దువ్వుతున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు మాత్రం ఈ విషయం తమ అధినేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లలేదని,  అయితే రాహుల్ గాంధీ తమ విన్నపాన్ని  తప్పకుండా అంగీకరిస్తారన్న నమ్మకం తమకు ఉందని వారంటున్నారు. ఈ విషయమై సీనినటి ఖుష్బూ మాట్లాడుతూ  ఈ విషయమై మేము రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుని వెడతామని,  అయితే నిర్ణయం మాత్రం రాహుల్ గాంధీ,  చంద్రబాబు నాయుడికే వదిలివేసామని అన్నారు. అయితే మహాకూటమిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కంటే కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే చక్రం తిప్పుతున్నారని వినికిడి.
అయితే మహాకూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో, ఆ పార్టీలన్నింటినీ కూడా తన అధీనంలోకి తీసుకుని చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఏ మహిళా నేతకు అవకాశం ఇస్తుంది. రేసులో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు గీతారెడ్డి,  డి.కె.అరుణ వంటి వారు ఉన్నారు. వీరందరినీ కాదని రాములమ్మకు పట్టం కడుతుందా. రేసులో నేనున్నానంటున్న విజయశాంతికి ఎలా అవకాశం ఇస్తారంటున్నారు. గత నాలుగేళ్లుగా విజయశాంతి ఏమైపోయారని, ఒక సినిమా అయిపోగానే  వేరొక సినీమాలో నటించడానికి సిద్దంమయినట్లు,  ఈ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీలోకి, ఆ పార్టీ నచ్చకపోతే ఈ పార్టీ అంటూ పార్టీలు మార్చారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.  అయితే  మహిళ ముఖ్యమంత్రి విషయమై  తెలంగాణ మహిళ నేతలు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని,  ఈ విషయం కూడా కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి హామీలా గాలికి కొట్టుకుపోక తప్పదని  రాజకీయ పండితులు అంటున్నారు.
Tags:Female Leaders in the Race Race

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *