Female SI who expressed humanity

మానవత్వాన్ని చాటుకున్న మహిళా ఎస్ఐ

Date:23/10/2020

పలమనేరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంఅనారోగ్యంతో బాధపడుతూ నాలుగు రోజులుగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఓఅభాగ్యురాలిని ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకుని అందరిచేత శభాష్ అనిపించుకున్నారు, పలమనేరు మహిళా ఎస్ఐ ప్రియాంక ..పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డుకు చెందిన భాగ్యమ్మ అనే అభాగ్యురాలు తన భర్త మరణానంతరం కళాశాల ఆవరణలో పండ్లు,కాయలను అమ్ముకొని అక్కడే ఓ పూరి గుడిసెలో తలదాచుకుంటూ జీవనం సాగిస్తోంది.గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ అనారోగ్యానికి గురైంది. దీంతో స్థానికులతో పాటు బాధితురాలి దూరపు బంధువులు సైతం కోవిడ్ అనే అనుమానంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకురాలు ప్రమీళమ్మ ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రియాంక వెంటనే ఆ వృద్దురాలి నివాసం వద్దకు చేరుకొని తమ సిబ్బంది సాయంతో ఆమెను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సలందేలా చొరవ చూపారు. మహిళా ఎస్ఐ వృద్దురాలి పట్ల స్పందించిన తీరు పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షల సడలింపు

Tags: Female SI who expressed humanity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *