ఫుల్ ఫుల్ గా   ఎరువులు

నిజామాబాద్  ముచ్చట్లు:

వాసకాలం సీజన్‌ ప్రారంభమైంది. జూన్‌ మొదటి వారం నుంచే వానలు దంచి కొడుతున్నా యి. ఇప్పటికే రైతులంతా యాసంగి పంటను విక్రయించగా తరువాతి పంటల సాగుకు రెడీ అయ్యా రు. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు వానకాలం అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కూడా వచ్చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతన్నలు సాగును సంబురంగా నిర్వహించేలా తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది వానకాలంలో వినియోగించిన ఎరువుల వాడకాన్ని అనుసరించి ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నది. 10శాతం అధికంగా నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో రైతులెవ్వరూ ఆందోళన చెందకుండా సాఫీగా ఎరువుల ప్రక్రియ సాగేలా సహకార శాఖ చర్యలు తీసుకుంటున్నది. నిజామాబాద్‌ జిల్లాలోని 89 సహకార సంఘాలకు ఎరువులు తరలించారు. గోదాముల్లో నిల్వ ఉండ గా రైతులు అడిగిన వెంటనే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు అందించేందుకు అధికార యం త్రాంగం సిద్ధమైంది.వానకాలం సీజన్‌ మొదలైనప్పటి నుంచి ఎరువుల డిమాండ్‌ ఉం టుంది. విక్రయ కేంద్రాల వద్దకు వీటి కోసం రైతులు వరుస కడుతుంటారు. కొరత ఉంటే వ్యవసాయ పనులు ఆలస్యమవడంతో పాటు దిగుబడులపై అధిక ప్రభావం చూపుతుంది. అందువల్లే ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికతో ముందుకు సాగుతున్నది.ఇందులో భాగంగానే ఇప్పటికే సహకార సంఘాలకు తరలింపును వేగవంతం చేసింది. నిజామాబాద్‌ జిల్లాలోని 89 సహకార సంఘాలో ఎరువులు సిద్ధంగా ఉంచారు. డీఏపీ 1079 మెట్రిక్‌ టన్నులు, యూ రియా 7124 మెట్రిక్‌ ట్ననులు, పొటాష్‌ 932 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ సూపర్‌ పాస్పెట్‌ 341 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువు 7153 మెట్రిక్‌ టన్నులు చేరవేశారు. పంపిణీ జరుగుతున్న కొద్దీ సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమస్యలు ఎదువ్వకుండా పర్యవేక్షించనున్నారు.ఎరువుల విక్రయానికి సంబంధించి సహకార శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా సహకార సంఘాలకు ఎరువులను చేరవేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ముందుకు సాగేలా రెడీ అయ్యారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి సిబ్బందికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమైన మేర ఎరువులు ఆయా సంఘాల గోదాములకు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా అమ్మి తే చర్యలు తప్పవని సిబ్బందికి గట్టి హెచ్చరికలు సైతం ఇచ్చారు. సహకార సంఘాల ద్వారా పంపి ణీ చేయనున్న ఎరువులు పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వీటి పరిధిలోని వారికి మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ తదితరాలను సమర్పించిన వారికే ఇవ్వాలని సహకార సంఘాల సీఈవోలను ఆదేశించారు. గతేడాది జిల్లాకు అవసరమైన ఎరువులు సరఫరా చేసినా అక్కడక్కడ స్వల్పంగా కొరత ఏర్పడింది. ఈ కారణాలపై నివేదిక పంపాలని సహకార శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. 10 బస్తాల కుంటే ఎక్కువ ఎరువులు తీసుకున్న వారి వివరాలను సహకార సంఘాల సీఈవోలు పంపాల్సి వచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిసింది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Fertilizer as full

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *