విచక్షణ రహితంగా ఎరువుల వాడకం తగ్గించాలి    

-పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి

మంథని ముచ్చట్లు:


విచక్షణ రహితంగా ఎరువుల వాడకం తగ్గించాలని,  అవసరం ఉన్నంత వరకే వాడుకోవాలని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి    రైతులకు సూచించారు. మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని రైతు వేదికలో వానాకాలం సాగుకు సన్నాహక సమావేశం వ్యవసాయ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రైతులకు వానా కాలం 2022 సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు మెళకువలు గురించి సాంకేతిక సలహాలు సూచనలు అందించారు.  ప్రత్తి  విత్తనాలు 60ఎంఎం వర్షపాతం నమోదు అయినాక పెట్టుకోవాలని, మొక్కల సాంద్రత పాటించాలన్నారు. ప్రత్తి లో అంతర పంటగా కంది పంట సాగు చేయాలని సూచించారు. కూలీల ఖర్చు పెరిగిందని దీనిని అధిగమించడానికి వరిని వెద జల్లే పద్దతి ద్వారా సాగుచేయలని తెలిపారు. వరిలో పచ్చి రొట్టె విత్తనాలు జీలగు, జనుము సాగుచేయాలని,  చవుడు బూములలో సాగు చేసి సారవంతంగా మార్చుకోవాలన్నారు. భూమిలో నిల్వ ఉన్న బాస్వరాన్ని కరిగించే పీసీబీ ని వాడుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంట రాజు , రైతు బంధు గ్రామ శాఖ అధ్యక్షులు ఎమ్. శేకర్, ఉదరి లచ్చయ్య, ఏడిఏ పి.మురళీ, మండల వ్యవసాయాధికారి పి. అనూష , ఏఈఓ శివకుమార్, స్రవంతి, మాలవిక, సుధీర్,మురళీ, మధుకర్ లతో పాటు రైతులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Fertilizer use should be reduced indiscriminately

Post Midle
Natyam ad