పండగే పండగ..

Date:07/12/2018
కర్నూలు ముచ్చట్లు:
కొత్త సాగునీటి ప్రాజెక్టుల్లో విధులు నిర్వహించేందుకు కొందరు ఇంజినీర్లు ఎగిరి గంతేస్తున్నారు. ఈమేరకు తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికే అధికార పార్టీ నేతలను ఆశ్రయించి.. సిఫార్సులు కూడా చేయించుకుంటున్నారు. ఎందుకంటే రూ.కోట్ల విలువతో చేపట్టే నూతన ప్రాజెక్టుల్లో భారీగా కాసులతో జేబులు నిండటంతోపాటు.. రెండేళ్ల వరకు మరో ప్రాజెక్టు కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఈమేరకు కర్నూలు జిల్లాలో జలవనరుల శాఖ పరిధిలో వేదవతి, రాజోలి బండ మళ్లింపు(ఆర్డీస్‌) పథకాల ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. దీంతో ఈ ప్రాజెక్టులు తమ పరిధిలోని డివిజËన్లకు రావాలని కొందరు, ఈ నూతన ప్రాజెక్టుల్లోనే విధులు నిర్వహించాలని మరికొందరు మరింత ఉత్సాహ పడుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పూర్తిస్థాయి నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. డిసెంబరుËలో ఈ రెండు ప్రాజెక్టులకు రూ.3,223 కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలుత వేదవతి ప్రాజెక్టుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది.
జిల్లాకు రూ.3,223 కోట్లతో వేదవతి, ఆర్డీఎస్‌ కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ కేటాయించి.. అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. ఈ ప్రాజెక్టులను ఏ సర్కిల్‌, ఏ డివిజన్లకు అప్పగిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు ఈ రెండు ప్రాజెక్టులు కర్నూలు సర్కిల్‌ పరిధిలోని దిగువ కాల్వ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. ఏకంగా రూ.3,223 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను కర్నూలు సర్కిల్‌కే అప్పగిస్తారా.. లేక ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌బీసీ-2 సర్కిల్‌కు అప్పగిస్తారా..? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎంతోకాలంగా ఈ ప్రాజెక్టుల కోసం నేతల చుట్టూ… అనుమతులు, నమూనాల కోసం సొంత ఖర్చులు చేసుకుని విజయవాడకు తిరిగితే, చివరి దశలో మరో సర్కిల్‌కు ఎలా ఇస్తారని కొందరు ఇంజినీర్లు వాదిస్తున్నారు. కాగా.. రెండింటిలో ఒక ప్రాజెక్టును మరో సర్కిల్‌, లేదా డివిజన్‌కు మార్చే అవకాశముంది.
జిల్లాకు రెండు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అని.. కొందరు నేతలు, ఇంజినీర్లు ఎదురుచూస్తున్నారు. వీటిలో ఒక్క ప్రాజెక్టు జిల్లాకు మంజూరైనా సంబంధిత ఇంజినీర్లకు 0.25 శాతం ప్రకారం రూ.3 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. వీటికోసమే కొందరు ఇంజినీర్లు కాచుకుని ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రాజెక్టు దక్కించుకున్న ఏజెన్సీ ఒప్పందం(అగ్రిమెంట్‌) పేరుతో ‘‘కాసుల బోణీ’’కి శ్రీకారం చుడతారు. తరువాత మొబలైజేషన్‌ అడ్వాన్స్‌(10 శాతం) పేరుతో సంబంధిత ఏజెన్సీ ప్రభుత్వం నుంచి కొంత బడ్జెట్‌ తీసుకుంటుంది. వీటిలో సంబంధిత నేతలు, ఇంజినీర్లు, అధికారులు ఎవరికి వారు భాగాలు పంచుకునే అవకాశం ఉంది.
Tags:Festive festival ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *