చౌడేపల్లెలో ఫీవర్‌ సర్వే ను పక్కాగా నిర్వహించి కోవిడ్‌ టెస్ట్ లు చేయాలి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ఇంటిటా ఫీవర్‌ సర్వేను పక్కాగా నిర్వహించి, లక్షణాలున్న వారికి కోవిడ్‌ టెస్ట్ లు చేయాలని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రామమూర్తి లు సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటరత్నం, డెప్యూటీ తహసీల్దార్‌ మాధవి, డాక్టర్‌ పవన్‌లతో పాటు వైద్య సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ వలంటీర్లు,ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు , రెవెన్యూ సిబ్బంది కలిసి పక్కాగా సర్వే నిర్వహించి కోవిడ్‌ నివారణకు కృషిచేయాలన్నారు. కోవిడ్‌ పాజిటీవ్‌ రేటు ను తగ్గించడంతోపాటు టెస్ట్ లు సంఖ్యను పెంచాలని సూచించారు. హోం మ్‌ ఐసొలేషన్‌లో ఉన్న రోగులకు వైద్య సేవలను అందించి ,ప్రైమరీ, సెంకరీ కాంట్యాక్టులను గుర్తించి వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. వైద్య సిబ్బంది పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు.అనంతరం అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ వరుణ్‌భరత్‌,ఆర్‌ఐ సుధాకర్‌ నాయక్‌, ఎంపీహెచ్‌ఈఓ మునిరాజు తదితరులున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Fever survey should be conducted properly in Kovadepalle and Kovid tests should be done

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *