వానా కాలం పంటలపై లెక్కలు తీస్తున్న అధికారులు

Date:17/08/2019

అదిలాబాద్ ముచ్చట్లు:

వానాకాలంలో సాగువుతున్న పంటల వివరాలను సేకరిస్తున్నారు. క్లస్టర్‌ల వారీగా ఏఈవోలు తమ ట్యాబ్‌లలో ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. జిల్లాలో పత్తి, సోయా, కంది పంటలను రైతులు ఎక్కువ సాగుచేస్తారు. జిల్లా వ్యాప్తంగా 9 మార్కెట్‌యార్డులు ఉండగా వివిధ పంటలు దిగుబడుల వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తారు. కొందరు వ్యాపారులు, దళారులు సైతం రైతుల వద్ద నుంచి పంటను కొంటారు. పంట దిగుబడులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రైవేటు వ్యాపారులు, దళారులు రైతులకు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర చెల్లిస్తారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటలను తమకు అనుకూలంగా ఉన్న రైతుల వద్ద నుంచి పట్టా పాసు పుస్తకాలను తీసుకుని వాటి ఆధారంగా వ్యాపారులు, దళారుల పంటలను మార్కెట్‌యార్డుల్లో మద్దతు ధరకు విక్రయిస్తారు.

 

 

 

మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతులు, దళారులు సైతం జిల్లాలోని వివిధ మార్కెట్‌యార్డుల్లో తమ పంటలను విక్రయించేందుకు వస్తారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉండడంతో దళారుల దందాకు చెక్ పడనున్నది.ఈ వివరాలు పంటలను కనీస మద్దతు ధరకు కొనడంతో పాటు పంట దిగుబడులను అంచనా వేయడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం కోసం ఉపయోగపడుతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

 

 

 

 

 

జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా వానాకాలం పంటలు సాగు చేస్తారు. పత్తి, కంది, సోయా పంటలను ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడాది కాలం కలిసిరావడంతో పంటల సాగు ఆశాజనకంగా ఉంది. వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2.10 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగువుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పత్తి, సోయా, కంది, పెసర ఇతర పంటలకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో పంట దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉండే అవకాశముంది. అన్నదాతలు ఎంతో కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడానికి వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

 

 

 

 

ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లోని రైతులు సాగు చేసిన పంటల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 101 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా ఏఈవోలు తమ క్లస్టర్ల పరిధిలో రైతుల వారీగా వివరాలు ట్యాబ్‌లలో నమోదు చేసుకుంటున్నారు. ప్రధానంగా గ్రామం, రైతు పేరు, భూమి సర్వే నంబరు, పంట సాగు చేసిన విస్తీర్ణం, ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారని వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు పంటల సాగు వివరాల సేకరణ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు అంటున్నారు.జిల్లా వ్యాప్తంగా సాగవుతున్న పంటల వివరాలు అధికారుల వద్ద ఉండడంతో రైతులకు పలు రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి.

 

 

 

 

ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతులు సాగు చేసిన పంటల వివరాలను సేకరిస్తుండడంతో అసలైన రైతులు మాత్రమే మార్కెట్‌యార్డుల్లో పంటలను మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. మార్కెట్‌యార్డుల్లో హాకా, మార్క్‌ఫెడ్, నాఫెడ్, సీసీఐ లాంటి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పంటను అమ్మాలంటే వ్యవసాయ విస్తీరణ అధికారులు ధృవీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంటుంది.

 

 

 

 

జిల్లాలో వానాకాలం పంటల వివరాలను సేకరిస్తున్న అధికారుల వద్ద ముందగానే ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటను సాగుచేశారనే వివరాలు అందుబాటులో ఉండడంతో వాటి ఆధారంగా ఏఈవోలు సర్టిఫికెట్‌లు జారీ చేస్తారు. పంటలను పరిశీలించిన అధికారులు దిగుబడులను సైతం అంచనా వేస్తారు. దీంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు పరిహారం అందించడానికి ఈ వివరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అధికారులు అంటున్నారు.

పరుగులు పెడుతున్న డిండి ఎత్తిపోతల పథకం

Tags: fficers who are counting on rainfall crops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *