Natyam ad

 ల్యాండ్ కన్వర్షన్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలన-నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్..

నంద్యాల ముచ్చట్లు:
కొలిమిగుండ్ల మండలం లో దాదాపు అరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్  బాజ్ పాయ్ అన్నారు.
బుధవారం కొలిమిగుండ్ల మండలం లోని ల్యాండ్ కన్వర్షన్ భూములను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్  బాజ్ పాయ్. కొలిమిగుండ్ల తహసీల్దార్ షేక్ మొహిద్దీన్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. కొలిమిగుండ్ల  మండల కేంద్రంలో దాదాపు ఏడు ఎకరాలు.  కల్వటాల గ్రామ పొలిమేరలో రాంకో సిమెంట్ వారికి సంబంధించి 51 ఎకరా. రైతులకు సంబంధించి మూడున్నర  ఎకరా. ఇటిక్యాల గ్రామము నందు మూడున్నర ఎకరా. రాఘవరాజు పల్లె యందు దాదాపు మూడు ఎకరాల భూములను ల్యాండ్ కన్వర్షన్ కొరకు పరిశీలించడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల మండల సర్వేయరు. మండల ఆర్ ఐ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Field inspection of land conversion lands – Nandyala Sub Collector Chahat Bajpayee