మండే సూరీడు….

Date:22/05/2019

నల్గొండ ముచ్చట్లు:

తెలంగాణ మాత్రం… అగ్నిగుండంగా మారింది. 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతుున్నారు. ఉదయం 8 దాటితే ఎండ తీవ్రత పెరిగిపోతుంది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఎండ దెబ్బకు 15 మంది మృత్యువాత పడ్డారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు హైదారబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణతోపాటు ఏపీలోని చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.మరోవైపు, ఛత్తీస్ గఢ్ తెలంగాణ మీదుగా కిలో మీటర్ ఎద్తులో ఉపరితలద్రోణి ఆవరించిఉంది. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో రేపు, ఎల్లుండీ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు.ఉపరితల ఆవర్తనప్రభావంతో రాలయసీమ, కోస్తాంధ్రలో కూడా వర్షాలు కురుస్తాయన్నారు వాతావరన శాఖ అధికారులు. మరోవైపు నిన్న ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భారీ వర్షానికి వణికింది. నిన్న సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవగా, ఆలయ పరిధిలోని పలు భారీ వృక్షాలు నేలకూలాయి.

 

 

 

 

 

 

పదుల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందిమే నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 15 రోజులపాటు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగత్రలు నమోదువుతోంది. వరుణుడు అకాల వర్షాలు కురిపించినప్పుడు మాత్రమే ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి జిల్లాల వాసులకు సైతం రెండు రోజుల నుంచి ఎండ దెబ్బకు చుక్కలు కనపడ్డాయి. ఇటీవల ఎన్నడూ లేని విధంగా శనివారం మూడు జిల్లా కేంద్రాల్లో అటూఇటుగా 43 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. తేడా లేనంతగా ఉడికిపోయారు. బయటకి రాగానే ఐదు నిమిషాలకే సొమ్మసిల్లి పడిపోయేంత వేడి శరీరానికి తాకడంతో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేటలో ఆదివారం రికార్డు స్థాయిలో 43.9 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. మూడు జిల్లాలోనూ మూడురోజుల నుంచి రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తొలకరి జల్లులు ఈసారి రెండురోజులు ముందుగానే రాష్ట్రాన్ని పలకరిస్తాయన్న విషయాన్ని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు మే నెలాఖరు వరకు కేరళ తీరాన్ని తాకుతాయని.

 

 

 

 

 

జూన్‌ మొదటి వారంలో రాష్ట్రానికి  చేరుకుంటాయని చల్లని కబురు అందించారు. ఇది విన్న భానుడు తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడేమో అన్నంతగా  చెలరేగిపోతున్నాడు. చివరి రోజుల్లో విజృంభించి రికార్డుస్థాయిలో ఎండలను కురిపిస్తున్నాడు. మూడు రోజుల నుంచి ప్రజలు బయటకు రావటానికి అల్లాడిపోతున్నారు.గడిచిన మూడు రోజుల నుంచి ఉదయం 9 గంటలకే 38 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పైగా ఉష్ణోగత్ర నమోదవుతోంది.  తిరుమలగిరిలోని ఐఎండీ కేంద్రంలో నమోదైన వివరాల మేరకు.. సూర్యాపేట జిల్లాలో ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు చేరుకుంటోంది. గంట గంటకు పెరుగుతూ.. మధ్యాహ్నం వరకు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సాయంత్రం 5.30 గంటలు దాటినా 35కు పైగా డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఎండలు 42 డిగ్రీలు దాటితే మానవ శరీరానికి హాని కలిగించే అతినీల లోహిత కిరణాలు 7 నుంచి 8 శాతం నమోదవుతున్నట్లు వారు గుర్తించారు. ఒత్తిడితో కూడిన వడగాలులు 15 కిలోమీటర్ల వేగంతో వీచినట్లు నమోదైంది. ఇలాంటి సమయంలో ఎండలో తిరిగితే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని
వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంటి చూపుపై ఇవి ప్రభావం చూపిస్తాయని చివ్వెంల వైద్యాధికారి శ్రీనివాసరాజు వెల్లడించారు. క్యాటరాక్ట్‌, కార్నియా తదితర కంటి భాగాలపై ప్రభావం చూపుతాయన్నారు.

 

 

 

 

 

 

 

చర్మసంబంధ వ్యాధులు ప్రారంభమై దీర్ఘకాలంలో కేన్సర్‌గా మారే ముప్పు ఉన్నట్లు వివరించారు. తలనొప్పి, అలసట, ఆయాసం, వడదెబ్బలకు గురయ్యే ప్రమాదాలు ఉంటాయన్నారు. వీటి బారిన పడకుండా ఉంటాలంటే జాగ్రత్తలు పాటించాలని సూచించారుఉష్ణోగ్రతల ప్రభావంతో విద్యుత్తు వినియోగం అసాధారణంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వేడిమి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను నిరంతరం ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం సాధారణానికి మించి నమోదవుతోంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సాధారణ వినియోగం కన్నా రోజుకు 200 నుంచి 300 మెగావాట్ల విద్యుత్తు అదనపు డిమాండ్‌ వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం వినియోగం పెరిగిపోవడంతో ఈమేరకు డిమాండ్‌ వస్తున్నట్లు గుర్తించారు.

 

అడుగంటిపోతున్న భూగర్భ జలాలు

 

Tags: Fiery sunrise

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *