జనవరి 12న ఐదవ విడత అఖండ బాలకాండ పారాయణం
తిరుమల ముచ్చట్లు:
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి 12వ తేదీ బుధవారం ఐదవ విడత అఖండ బాలకాండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుండి 8 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.బాలకాండలోని 18 నుండి 21 సర్గల వరకు గల 130 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.కాగా, కరోనా వైరస్ నశించాలని కోరుతూ 2020, జూన్ 11న సుందరకాండ పారాయణం ప్రారంభమైంది. 2021 జులై 24 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ తరువాత కరోనా వైరస్ మూడో దశలో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడకుండా స్వామివారిని ప్రార్థిస్తూ 2021 జులై 25వ తేదీ నుండి బాలకాండలోని శ్లోకాలను ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు పారాయణం చేయగా, శాస్త్ర పండితులు ఆచార్య రామానుజాచార్యులు ఫలశృతిని వివరిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Fifth installment of Akhanda Balakanda recitation on January 12