ఖమ్మం కాంగ్రెస్ లో అన్నదమ్ముల ఫైట్

Fight Against Khammam Congress

Fight Against Khammam Congress

Date:21/11/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకున్న కాంట్రాక్టర్ కందాళ ఉపేందర్‌రెడ్డి స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోకుండా ఒంటెద్దు పోకడలను అవలంభిస్తున్నారని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ధీటుగా ఎదుర్కోవలసిన పరిస్థితుల్లో సర్వం తానేననే మార్గంలో ఉపేందర్‌రెడ్డి పయనిస్తున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
‘ఎవరికి వారే యమునా తీరే’ చందంగా పరిస్థితి తయారైందని కాంగ్రెస్ శ్రేణులు మథనపడుతున్నాయి. పాలేరు నియోజకవర్గంలో కీలక పార్టీ అయిన సీపీఐ పార్టీ నాయకులు నేటి వరకు కందాళకు మద్దతు ప్రకటిస్తామని తెలిపిన దాఖలాలు లేవు. నామినేషన్ వేసే కార్యక్రమంలో సీపీఐ జెం డాలు కనిపించకపోవడం గమనార్హం. పాలేరు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న ఖమ్మం రూరల్ నుంచి మౌలానా, నేలకొండపల్లి నుంచి భాను ప్రసా ద్, కూసుమంచి నుంచి సంగబత్తుల వెంకట్‌రెడ్డి, గుండెపోంగు మల్లేష్  తదితరులు కందాళ ఉపేందర్‌రెడ్డికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇంకోవైపు కందాళ సోదరులు మధ్య విభేదాలు ఉన్నట్లు, వారిలో సఖ్యత లేనట్లు ప్రచారం జరుగుతోంది.
మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా వారినే నియమించ డం, నామినేషన్ల తరువాత వారిని తొలగించి మరికొంత మందిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వాళ్లు కార్యకర్తలను, నాయకులను కలుపుకుని పో యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. పొలింగ్‌కు గడువు తరుముకొస్తున్నా, ప్రచార ఉధృతి పెరగకపోవడం వెనుక పార్టీ అభ్యర్థి వైఖరే కారణంగా కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.అభ్యర్థి అవలంభిస్తున్న వైఖరి కారణంగా కూటమికి చెందిన పార్టీల నేతలేగాక, టికెట్‌ను ఆశించిన నాయకులు సైతం ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పరిణామాలు తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలు  తొలిసారి ఈ ఎన్నికల్లో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి స్థానిక పరిస్థితులను, పార్టీకి ఉపకరించే కేడర్‌ను బేఖాతర్ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వ్యా  నియోజకవర్గంలో జరుగుతున్న పలు పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పాలేరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకు న్నారు. వీరిలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఈడా శేషగిరిరావు, రఘురాంరెడ్డి, జలగం ప్రసాద్‌రావు, పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవి, చరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వీరిలో జలగం ప్రసాద్ టీఆర్‌ఎస్‌లో చేరగా, గాయత్రి రవి వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్‌ను దక్కించుకున్నారు.
టికెట్ కోసం ఎంత మంది పోటీపడినప్పటికీ, అభ్యర్థిత్వం దక్కించుకున్న నాయకుడు మిగతా నేతలను కలుపుకుని పోవలసిన అవసరముందనే వాస్త వాన్ని గ్రహించకపోవడమే అసలు సమస్యగా పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. పాలేరు సెగ్మెంట్ నుంచి పలుసార్లు ప్రాతినిథ్యం వహించి మంత్రి పదవిని కూడా నిర్వహించిన సంభాని చంద్రశేఖర్ వంటి నాయకులను, స్థానికంగా మంచి పట్టు ఉన్న ఇతర నాయకులను టికెట్ దక్కించుకున్న ఉపేందర్‌రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయా నాయకుల అనుచరగణం పేర్కొంటోంది.
పాలేరు సెగ్మెంట్‌కు ప్రాతినిథ్యం వహించిన రాంరెడ్డి వెంకటరెడ్డి దివంగతులయ్యాక పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే సారథి లేకపోవడం గమనార్హం. పార్టీ కేడర్ మాత్రమే గల నియోజకవర్గంలో కందాల వైఖరివల్లే కూటమి పార్టీల్లో ఒకటైన సీపీఐ మద్దతు తెలపడం లేదంటున్నారు.ప్రధాన నేతల పరిస్థితి ఈ విధంగా ఉండగా వివిధ మండలలాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కందాళ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
మండలాల వారీగా తిరుమలాయ పాలెం లో ఇజ్రాయిల్, కూసుమంచిలో మహ్మద్ హాఫీజుద్దీన్, కొరివి వెంకటరత్నం, ఖమ్మం రూరల్, నేలకొం డపల్లి మండలా ల్లో మరి కొంతమంది నాయకులు కందాళ ఉపేందర్‌రెడ్డికి సహకరించడం లేదు. ముఖ్యంగా కొంత మంది ప్రజాప్రతినిధులు ఆయనను కలిసిన దాఖలాలు కూడా లేవు.ఉపేందర్‌రెడ్డి సైతం వీరిని కలు పుకునిపోయేందుకు చేసిన ప్రయత్నాలు కూడా లేవంటున్నారు. మరోవైపు టీడీపీ, టీజేఎస్ పార్టీల కీలక నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
పాలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన స్వర్ణకుమారి, బత్తుల సోమయ్యలను కందాళ ఉపేందర్‌రెడ్డి కలుపుకుని పోయే పరిస్థితి మృగ్యమైందంటున్నారు. అలాగే కూటమి పార్టీలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలను, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కలుపుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కలిగిన కొందరు వ్యక్తులను అభ్యర్థి తన అనుచరగణంగా,  వ్యూహకర్తలుగా నియమించుకోవడాన్ని కూడా కాంగ్రెస్ వర్గాలు జీర్ణించు కోలేకపోతున్నాయి.
Tags; Fight Against Khammam Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *