అప్పన్న ఆలయంలో ఆధిపత్య పోరు

విశాఖపట్టణం ముచ్చట్లు:

 

 

సింహాచలం అప్పన్న సన్నిధిలో ఆధిపత్య పోరు ముదిరింది. అర్చకులు రెండు వర్గాలుగా చీలిపోయి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. ఒక వర్గం అర్చుకులు ఆలపించిన గీతాలాపనను మరో వర్గం మార్ఫింగ్‌తో మాయ చేసినట్లు తెలుస్తోంది. వారు పాడిన సింహాచల అప్పన్న పాటలను అన్యమత గీతాలుగా, వీధి పాటలుగా మార్చేసి వీడియోలు వైరల్ చేసింది మరోవర్గం. నిత్యం స్వామివారి సన్నిధిలో గడిపే అర్చకులు ఇలాంటి పనులకు పాల్పడటం చూసి భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.ఆధిపత్య పోరుతో అర్చకులు ఆలయ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఆలయంలో నారసింహుడి గరుడోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో నాగసింహ గర్జనలను సీతారాం అనే అర్చకులు ఆలపించారు. ఆ ఆడియోను మరో ఇద్దరు అర్చకులు మార్ఫింగ్ చేశారు. గర్జనలను కాస్తా మరో మతం గీతాలు పలికించారు. వీధిపాటలు పాడుతున్నారంటూ వెరైటీగా చిత్రీకరించి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. ఆ వీడియో చూసిన మరో వర్గం అర్చకులు ఇంతటి పాపానికి ఒడిగడతారా అంటూ మండిపడుతున్నారు.అయితే మీకూ మీకూ ఉంటే మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి గానీ.. దేవుడితో పరాచకాలు ఆడటమేంటని భక్తులు నిలదీస్తున్నారు. పరిస్థితి చేజారుతుండటంతో ఆలయ ఈవో సూర్యకళ.. స్థానాచార్యులు, అర్చకులతో సమావేశం నిర్వహించారు. పూజారుల మధ్య సఖ్యతకు ప్రయత్నించారు. అయితే చినికి చినికి గాలివానగా మారుతున్న ఈ తంతగంలో అసలు మార్ఫింగ్ చేసిందెవరు? నిజంగా జరిగిందా? అసలు గొడవకు కారణమేంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి. తప్పుడు ప్రచారాలతో ఆలయం పరువు తీస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Fight for supremacy in Appanna temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *