.హైద్రాబాద్ లో కాంగ్రెస్ లో ఇంటి పోరు

Fighting at home in Congress in Hyderabad

Fighting at home in Congress in Hyderabad

Date:13/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
 హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకుల తీరుపై కార్యకర్తలు మండిపడుతున్నారు. నేతల వైఖరిపైన నిప్పులు చెరుగుతున్నారు. నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు హడావుడి చేస్తున్నారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటీ నాయకుల వ్యవహార శైలిపైన ముద్రించిన కరపత్రాలు ఇప్పుడు  కాంగ్రెస్ లో సంచలనం  సృష్టిస్తున్నాయి.నగర కాంగ్రెస్ లో కరపత్రాల యుద్ధం జరుగుతోంది. పార్టీ నేతల వైఖరిపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలు నేతలను కరపత్రాల్లో కడిగిపారేస్తున్నారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిపైన గుర్తు తెలియని వ్యక్తులు ఫాంప్లేట్స్ ముద్రించారు. ఏడుగురు ముఖ్య నాయకులపైన తీవ్ర విమర్శలు చేస్తు ముద్రించిన కరపత్రాలు ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. వి.హనుమంతరావు, దానం నాగేందర్ , ముఖేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి విష్ణువర్థణ్ రెడ్డి, వినయ్ కుమార్ తీరు ను ఈ రహస్య కార్యకర్త కడిగిపారేశాడు. ఒక్కొక్కొ నాయకుడి వ్యవహార శైలిని వివరిస్తూ కరపత్రాలు ముద్రించారు. జంటనగరాల కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో ఫాంప్లేట్‌ను విడుదల చేశారు. సీనియర్ నాయకులు దద్దమ్మలు…ప్రజల్లోకి వెళ్ళకుండా రాజకీయాలు చేస్తున్నారంటూ పాంప్లెట్స్‌లో ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేయడం లేదంటూ విమర్శించారు. సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ తిరిగే వీరు.. వందమంది కార్యకర్తలతో కూడిన ఒక్క సమావేశం కూడా నిర్వహించలేకపోతున్నారని కరపత్రంలో నిప్పులు చెరిగారు.సీనియర్ నేత వి.హనుమంతరావు  బీసీ నాయకుడినని చెప్పుకుంటు పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాని ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా పిలిపించుకోవడం దౌర్భాగ్యమని విమర్శించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌ను కూడా కరపత్రంలో ఏకి పారేశారు. టీఆర్ఎస్ లో చేరడానికి కేసీఆర్ కాళ్లు పట్టుకొన్న దానం తన స్థాయి దిగజార్చుకున్నారని ఫాంప్లేట్ లో నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్‌లో ఉంటాడో, పోతాడో స్పష్టం చేయాలని పాంప్లెట్‌లో డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పైన పాంప్లెట్స్‌లో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ముఖేష్‌గౌడ్‌ను టీఆర్ఎస్‌లోకి తీసుకోకపోవడవల్లే ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. అంజన్ కుమార్, మర్రి శశిధర్ రెడ్డి ఇక ముందైనా పార్టీ కోసం పనిచేయాలని లేఖలో సూచించారు. విష్ణువర్థన్ రెడ్డి లాంటి యువ నాయకుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపైన మాట్లాడకుండా కూర్చున్నారంటూ కరపత్రంలో తప్పు పట్టారు. హైదరాబాద్ నాయకులపైన బయటకు వచ్చిన కరపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పార్టీ లో కూడా దీనిపైన విస్తృత్తమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ కరపత్రం  వెనుక ఎవరున్నారనే కోణంలో బాధిత నాయకులు ఆరా తీస్తున్నారు.
Tags: Fighting at home in Congress in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *