Fighting until the repeal of the Citizenship Act

పౌరసత్వచట్టం రద్దు చేసేదాక పోరాటం

Date:18/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల మనుగడకు విఘాతం కలిగించేలా ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టంను రద్దుచేసే దాక పోరాటం సాగిస్తామని రాతిమసీదు ముతవల్లి ఇనాయతుల్లా షరీఫ్‌ శనివారం స్పష్టం చేశారు. ఈసందర్భంగా ముస్లింలు ప్లకార్డులు పట్టుకుని పౌరసత్వం వద్దు… ఎన్‌ఆర్‌సి,సీఐఏ, ఎన్‌ఆర్‌పి రద్దుపరచండి…. రాజ్యాంగాన్నికాపాడండి…. దేశాన్నివిభజించ వద్దు అన్న నినాదాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇనాయతుల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో ముస్లింలు ఎనిమిదవ రోజు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని పౌరస్వతబిల్లు రద్దు చేయాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా ముత వల్లి ఇనాయతుల్లా షరీఫ్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆనాలోచిత చర్యలు కారణంగా దేశంలో అల్లర్లు జరిగి , శాంతికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మతాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దమైన చట్టాలను చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పౌరసత్వ చట్టాన్ని రద్దు చేసే దాక ముస్లింలు ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండు చేశారు.

రైతులందరికి విరివిగా రుణాలు మంజూరు

Tags: Fighting until the repeal of the Citizenship Act

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *