కైలాసపురం సాయిబాబా గుడిలో సినిమా షూటింగ్
విశాఖపట్నం ముచ్చట్లు:
దొర ఎంటర్టైన్మెంట్ సమ ర్పణలో ప్రొడక్షన్ నెంబర్ -1 షూటింగ్ విశాఖ కైలాసపురంలోని సాయిబాబా ఆలయంలో జరిగింది. ఈ షూటింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హాజరై ముహూర్తపు షాట్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.ఈ షూటింగ్ ఒకే షెడ్యూల్ లో ఏప్రిల్ నెలలో విశాఖ,పశ్చిమ, తూర్పు జిల్లాల్లో జరుగుతుందని దర్శక, నిర్మాత లు తెలిపారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా వంశీ, ప్రియాంక సింగ్, కీర్తన వర్మ నటిస్తున్నారు.అదే విధంగా ఈ చిత్రానికి దర్శకత్వం రామ్ గోపాల్ రత్నం, డివోపీ రమణ, నిర్మాత హనుమంతు తుకారామ్ వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం ఘన విజయం సాధించాలని వారు ఆకాక్షించారు

Tags;Film shooting at Kailasapuram Sai Baba Temple
