నాలుగోసింహాం మాదవ్‌ ఫైనల్‌ వార్నింగ్‌…

Final Four

Final Four

-పోలీసుల పేరేత్తితే నాలుకోస్తాం… ఖబడ్డార్‌
– జేసికి సీఐ గోరంట్లమాదవ్‌ వార్నింగ్‌

Date:21/09/2018

అమరావతి ముచ్చట్లు:

శాంతిభద్రతల కోసం  పని చేసే పోలీసులను చులకనగా మాట్లాడతారా…? …ఏం…తమషాలాడుతారా… పోలీసులను ఎవరైనా దూషిస్తే అడ్డంగా నాలుక కోసేస్తాం… పోలీసులంటే ఏమనుకుంటున్నారు…మేము లేకపోతే సమాజంలో మీరు ప్రశాంతంగా ఉండగలరా… ఇదే లాస్ట్ వార్నింగ్‌ పోలీసులను చులకన చేసి మాట్లాడినా…హెచ్చరించిన నాలుక కోసేస్తా జాగ్రత్త అంటు పోలీస్‌ నాలుగో సింహాం గోరంట్లమాదవ్‌ ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చారు.గత నాలుగు రోజులుగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులను అసభ్యపదజాలంతో దూషిస్తున్న అధికార పార్టీ ఎంపి జేసి దివాకర్‌రెడ్డికి గోరంట్లమాదవ్‌ అడ్డుకట్ట వేశారు. పోలీసులు మౌనం దాల్చడంతో జేసి రెచ్చిపోయి ప్రసంగాలు ఇవ్వడంతో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోరంట్లమాదవ్‌ చేసిన హెచ్చరికలు పోలీస్‌ కుటుంబాలలో మనోధైర్యాన్ని నింపింది. ప్రతి పనికి పోలీసులను వినియోగించుకునే రాజకీయ నాయకులు మెప్పుల కోసం పోలీసులను దూషించడం ఆనవాయితీగా మారింది. దీనికి తోడు అధికార బలం , పోలీసుల చర్యలకు అడ్డుకట్టలు వేయడంతో రాజకీయ నాయకుల దురఅహంకారం పెచ్చుమీరిపోయింది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర పోలీస్‌శాఖ తరపున సీఐ గోరంట్లమాదవ్‌ చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమై, జేసి నోటికి తాళాలు పడ్డాయి. ముఖ్యంగా జేసి మాటలతో సామాన్య ప్రజానీకానికి కూడ అసహ్యించుకుంటున్నారు. ఇకనైనా ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుని, పోలీసులకు అండగా ఉంటు, జేసి పైన కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

పనస పాడేరులో ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ట్రైకార్‌

Tags: Final Four

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *