రాష్ట్ర ఓటర్ల తుది జాబితా

Date:12/01/2019
విజయవాడ ముచ్చట్లు:
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు సైతం ఓటర్ల తుది జాబితా కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ శనివారం(జనవరి 12న) విడుదల చేసిన తుది జాబితా ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లు. వీరిలో పురుష ఓటర్లు 1,83,24,588 కోట్లు ఉండగా, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడించారు. ట్రాన్స్ జెండర్లు 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. 40,13,770 లక్షల మంది ఓటర్లతో అత్యధిక ఓటర్లు గల జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. 17,33,667 లక్షల మంది ఓటర్లతో విజయనగరం జిల్లాలో అతి తక్కువ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉండగా… విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు.
ఏపీ ఓటర్ల వివరాలు జిల్లాల వారీగా..
శ్రీకాకుళం – 20,64,330
విజయనగరం – 17,33,667
విశాఖపట్నం – 32,80,028
తూర్పు గోదావరి – 40,13,770
పశ్చిమ గోదావరి – 30,57,922
కృష్ణా – 33,03,592
గుంటూరు – 37,46,072
ప్రకాశం – 24,95,383
పొట్టిశ్రీరాములు నెల్లూరు – 22,06,652
కర్నూలు – 28,90,884
కడప – 20,56,660
చిత్తూరు – 30,25,222
అనంతపురం – 30,58,909
Tags:Final list of state voters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *