ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ శివారు రేకుర్తిలో కలకలం రేరపిన ఎలుగుబంటి చివరకు దొరికిపోయింది. అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎలుగరును బంధించి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి శ్రీపురం కాలనీలోకి ఎలుగు రావడంతో ప్రజలు భయాందో ళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఉదయం నుంచి ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ అది వారిని ముప్పు తిప్పలు పెట్టింది. చివరికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు.
Tags: Finally a trapped bear

