ఎట్టకేలకు వరించిన సర్కార్ కొలువు…

-పరీక్ష వ్రాసిన పాతికేళ్ళ తర్వాత 57 ఏళ్ళ వయసులో వరించిన టీచర్ ఉద్యోగం.

 

విజయవాడ ముచ్చట్లు:

చిన్నప్పటి నుంచి చదువంటే మక్కువ. టీచర్ కావాలన్న కోరికతో బీఈడీ పూర్తిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే తృటిలో తప్పిపోయింది. ఇటు కులవృత్తి కూడా కలిసి రాలేదు.. దీంతో భిక్షాటన చేసుకుంటున్నారు. ఇంతలో ఓ శుభవార్త ఆయన చెవిన పడింది.. ప్రభుత్వ ఉద్యోగం.. అది కూడా ఆయనకు ఇష్టమైన టీచర్ కొలువు. శ్రీకాకుళం జిల్లా సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టారు. 1994 డీఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. 1998లో డీఎస్పీ రాసినా వివాదాలతో నిలిచిపోయింది. దీంతో ఉద్యోగం రాదని భావించిన ఆయన సైకిల్‌పై చేనేత వస్త్రాలు విక్రయించడం ప్రారంభించారు. అది కలిసి రాలేదు. దీంతో ఆయన కడుపు నింపుకొనేందుకు పాతపట్నం పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటున్నారు. కాగా ఇటీవల కోర్టు చిక్కుముడులు వీడి డీఎస్సీ-1998 క్వాలిఫై జాబితాను అధికారులు వెల్లడించారు. అందులో కేదారేశ్వరరావు పేరు ఉంది. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన యువకులు ఆయనకు చేరవేశారు..

 

Tags: Finally, the government …