ఫైనాన్స్ యజమాని మర్డర్.

తిరుపతి ముచ్చట్లు:
 
చంద్రశేఖర్ ను సుత్తితో మోది.., హత్యచేసి మూటగట్టి పడవేసిన ఘనులు.ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించమని ఆడుతున్నాడన్న బాధతో హత్యకు పథకం.డిసెంబర్ 31 న చంద్రశేఖర్ కు ఇవ్వవలసిన ‘నగదు ఇస్తాం’ రా అని పిలిచిన మధు. చంద్రశేఖర్ కు నగదు ఇవ్వవలసిన మధు తోపాటు మరో ఇరువురు , రాజు,పురుషోత్తం లతో కలసి ఘాతుకానికి పాల్పడ్డ నిందితులు.ఇంటి నుండి వెళ్లిన తండ్రి ఇంటికి రాకపోవడంతో కుమారుడు రూపేష్ కుమార్ ఎస్ వి యూ పోలీస్టేషన్ లో పిర్యాదు.మిస్సింగ్ కేసును ఛేదించడంలో ఆనాడు కాల్ లిస్ట్ సేకరణ. కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు రాజు,మధు,పురుషోత్తం లే అని తేల్చివేత. ఈ నెల 1 న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తింపు.పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితులు.తిరుపతి- బాకరపేట అటవీప్రాంతంలో పడవేసిన ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు .పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు.ఎ పి టూరిజం లో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తూ ఎల్ బి నగర్ లో నివాసం.మిస్సింగ్ కేసును హత్య కేసుగా తేల్చిన ఎస్ వి యు పోలీసులు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Finance Owner Murder.

Natyam ad