సింగాపూర్ సర్వాయి మిత్ర ఫౌండేషన్  ఆర్థిక సహాయం

రామడుగు ముచ్చట్లు:

రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఏపూరి భూమయ్య గౌడ్(60) వృత్తిరీత్యా కలాలి తాటిచెట్టు ఎక్కే క్రమంలో వర్షానికి తాటి చెట్టు నాని ఉండటంతో గత నెల క్రితం చెట్టు నుండి జారిపడి తీవ్రంగా గాయాలవడంతో నిరుపేద కుటుంబానికి చెందిన భూమయ్య గౌడ్ యొక్క పరిస్థితులు సింగపూర్ లో ఉంటున్న గౌడన్నలకి తెలియజేయగా వారు సర్వాయిమిత్ర ఫౌండేషన్( ఎస్ జి ) ద్వారా ప్రతినెల ఒక పేద గౌడ కుటుంబాన్ని ఎంపిక చేసుకొని తమ వంతు సహాయంగా కొంత సహాయాన్ని అందిస్తారు. ఈ నెలలో ఏపూరి భూమయ్య గౌడ్ యొక్క కుటుంబ పరిస్థితులు తెలుసుకొని విచారణ వ్యక్తం చేస్తూ సర్వాయి మిత్ర ఫౌండేషన్( ఎస్ జి) వారి ఆధ్వర్యంలో 1,2016 రూపాయలు స్థానిక గౌడ సంఘం ప్రెసిడెంట్ కొండ వెంకటయ్య గౌడ్ చేతులమీదుగా భూమయ్య గౌడ్ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుద్దాల మల్లేశం గౌడ్, గౌడ సంఘం మెంబర్లు కొండ తిరుపతి గౌడ్, ముంజ లచ్చయ్య గౌడ్, ఎగోలపు కొమురయ్య గౌడ్, ఏపూరి వెంకటేశం గౌడ్, పొన్నం అజయ్ గౌడ్, సర్వాయి మిత్ర ఫౌండేషన్( ఎస్ జి) సభ్యుడు బుర్ర శ్రీకాంత్ గౌడ్ లు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నిరుపేద గౌడ కుటుంబాలకు తమ వంతుగా సహాయాన్ని అందజేస్తున్న సర్వాయి మిత్ర ఫౌండేషన్( ఎస్ జి) సభ్యులకు పేరుపేరునా భూమయ్య గౌడ్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

 

Tags: Financial assistance from Singapore Sarvai Mitra Foundation

Leave A Reply

Your email address will not be published.