పుంగనూరులో దళిత కుటుంభానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం- ఎంపీ రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:
అనుమానస్పద స్థితిలో ఐదునెలల క్రితం మృతి చెందిన శ్రీనాథ్ కుటుంభానికి రూ.5 లక్షల పరిహారాన్ని ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి మంజూరు చేయించారని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి గిరిజమ్మ , తండ్రి గంగులప్పకు ఎంపీ చేతులు మీదుగా రూ.5లక్షల చెక్కును అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ పెద్దిరె డ్డి కుటుంబం అన్ని వర్గాల వారికి అండగా ఉంటారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎంపీ మిధున్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబం ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ మోహన్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, రాజేష్, దళిత నేతలు అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: Financial assistance of Rs. 5 lakhs to a Dalit family in Punganur- MP Reddappa
