నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

Date:23/09/2020

ఎమ్మిగనూరు ముచ్చట్లు

పట్టణంలోని లక్ష్మిపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి పట్టణానికి చెందిన పాల శ్రీనివాస్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక వైఎస్సార్ కూడాలిలో టీ బంక్ (లింగం టీ స్టాల్) పెట్టుకొని జీవనం సాగిస్తున్న రామలింగం దంపతులకు ముగ్గురు కుమారులు.మొదటి కుమారుడు అయిన ప్రశాంత్ గత కొద్దిరోజుల క్రితం నుండి లివర్ సమస్యతో బాధపడుతున్నాడు.
ప్రశాంత్ వైద్య ఖర్చులకు చేయూతను అందించాలని పలు పత్రిక కథనాలు రావడంతో పట్టణానికి చెందిన పాల శ్రీనివాస్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ 34వ వార్డ్ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ విశ్వనాథ్ రమేష్,32వ వార్డ్ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ నర్సింహులు, పలువురు యువకులు బసిరెడ్డి, సుధాకర్ గౌడ్,రంగ,నారాయణ లు స్పందించి బాధిత కుటుంబ సభ్యులకు రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

 

ఏసీబీవలలో వీర్వో 

Tags:Financial assistance to a poor family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *