మరణించిన దంత వైద్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

-అపన్నహస్తం అందించిన జగిత్యాల వైద్యులు  శైలేందర్ రెడ్డి

Date:25/01/2021

జగిత్యాల  ముచ్చట్లు:

మరణించిన తోటి దంత వైద్యుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి  జగిత్యాలకు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణులు డా. శైలేందర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు.
కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుభాషినగర్ వద్ద ఈ నెల 21న  జరిగిన రోడ్డు ప్రమాదంలో దంత వైద్యుడు డా. ఆలెం కిరణ్ కుమార్ (37) దుర్మరణం చెందారు. దీంతో కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. దానికి తోడుకరోనా ప్రభావంతో ఆసుపత్రి సాగక, కుటుంబాన్ని వెళ్లదీయడం ఇబ్బందిగామారింది. చేసేదేమిలేక కుటుంబం  భవన నిర్మాణరంగకూలీగా మారారు.  వైద్యుడి కుటుంభ దైన్య పరిస్థితిని తెలుసుకున్న జగిత్యాల దంత వైద్యులు శైలేందర్ రెడ్డి ఆ  గ్రామానికి వెళ్లి  భార్య , ఇద్దరు పిల్లలలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్ర దంతవైద్యుల అసోసియేషన్ జిల్లా బాధ్యులు దంత వైద్యుడు శైలేందర్ రెడ్డి మానవతా దృక్పథంతో చేసిన సాయం పట్ల జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి,  శ్రీనివాస్,  తదితరులు  అభినందనలు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Financial assistance to the family of the deceased dentist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *