ఆర్ధిక ఉగ్రవాది కేసీఆర్;రేవంత్ రెడ్డి

హైదరాబాద్  ముచ్చట్లు:
మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్  తోడ్పాటు నేను మరవలేను. నా కు అధ్యక్ష భాధ్యత వచ్చింది అంటే…అది డీసీసీ అధ్యక్షుల తోడ్పాటేనని టీపీసీసీ ఛీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం అయన డీసీసీల తో సమావేశమయ్యారు. రేవంత్ మాట్లాడుతూ డీసీసీ లు తమ  నిర్ణయాన్ని సోనియా గాంధీ కి  బలంగా చెప్పడం వల్లే నేను పీసీసీ అయ్యా . కేసీఆర్ గత పది రోజుల నుంచి ఊరు, వాడ తిరుగుతున్నాడు…అంటే భూమి మీదకు దిగిండు.  ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి. ప్రతిపక్షాల కు ఆహ్వానం వచ్చింది. మరియమ్మ  కుటుంబానికి సహాయం ప్రకటించారని అన్నారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానన్న కేసీఆర్… పంజాగుట్ట లో ఉన్న అంబెడ్కర్ విగ్రహాన్ని పోలిస్ స్టేషన్ లో పెట్టారు. అన్ని కుల సంఘాల కు ఆత్మ గౌరవ భవనాలు కడుతామన్నాడు. అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికలప్పుడు మాత్రమే గొర్రెల పంపిణీ గుర్తుకు వస్తుంది. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో మాత్రమే గొర్రెల పంపిణీ జరుగుతుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే పోతే తప్ప గొర్రెల పథకం అమలు అయ్యేలా లేదన్నట్లు ఉంది. పదవి లో ఉన్న వారు ఎవరన్నా దేవుడు దగ్గరకు పోతే తప్పితే..అక్కడ పథకాలు అమలయ్యే లా లేవు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు మంచిగ ఉండాలి… కానీ వాళ్ళ పదవులు ఊడితే సంక్షేమ పథకాలు మన ఇంటికే వస్తాయి. 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లు లేవు..దీంతో బడుగు బలహీన వర్గాలు నష్టపోయాయని అన్నారు.
56 శాతం జనాభా ఉన్న బీసీ లకు బడ్జెట్ లో 3 శాతం నిధులు కేటాయించారు.  బీసీ లోన్లకు  5 లక్షల 20 అప్లికేషన్ లు పెండింగ్ లో ఉన్నాయి. నిన్న దళితులకు జరిగిన అన్యాయం పై ప్రశ్నించాం. ఈ రోజు బీసీ లకు జరుగుతున్న  అన్యాయం పై ప్రశ్నిస్తాం. మా బడుగులు కులవృత్తులు చేసుకుంటే..కేసీఆర్ కుటుంబం రాజ్యాన్ని ఎలుతుందా. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు..కేసీఆర్ తన బిడ్డ పోలికలతో  ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లి అని చెప్పిండు తప్ప ..తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గురించి చెప్పలేదు.  కానీ మన కళ్ళముందు కనిపిస్తున్న తల్లి సోనియా గాంధీ. ట్యాంక్ బండ్ పై అమరవీరుల స్తూపం నిర్మాణం లో కూడా అవినీతి జరిగింది. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్. 7 తేదీ తర్వాత కేసీఆర్ అక్రమాలు బయటపెడతానని హెచ్చరించారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Financial terrorist KCR; Rewanth Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *