నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా

-కామారెడ్డి మున్సిపల్ కమిషనర్

Date:08/05/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

కామారెడ్డి లో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ శైలజ హెచ్చరించారు , కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వస్త్ర- వ్యాపార సముదాయాలు సరి- బేసి విధానంలో ప్రారంభమయ్యాయి కొందరు వ్యాపారస్తులకు అవగాహన లేకపోవడంతో సరిసంఖ్య కేటాయించిన వ్యాపార సముదాయాలను  తెరవడంతో మున్సిపల్ సిబ్బంది హెచ్చరించి జరిమానా విధించారు. రోజు విడిచి రోజు తెరుచు కోవాలని సూచించారు. మరికొన్నిచోట్ల  కరోన వైరస్  కట్టడి లో  భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో  జరిమానా విధించారు కేటగిరి బీలో 1965 గుర్తించగా అందులో 785  దుకాణాలు తెరిచి వ్యాపారం కొనసాగించారని మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించండి వారికి రూపాయలు 6700ల జరిమానా విధించారని తెలిపారు , ఈ కార్యక్రమంలో ఆర్ఐ జానయ్య సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఔరంగాబాద్‌ రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశం

Tags; Fines if violated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *