Natyam ad

జింఖానా గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం-ఇద్దరు మృతి..

విజయవాడ ముచ్చట్లు:


విజయవాడ  జింఖానా గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగి మూడు ఫైర్ వర్క్స్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం 19 షాపులు ఉండగా  15, 16, 17 నెం దుకాణాలో మంటలు చెలరేగాయి. మూడు షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే సకాలంలో 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేయడంతో భారీ నష్టం తప్పింది.  ఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు.  మృతులు 15 వ నెంబర్ దుకాణానికి చెందినవారిగా అనుమానిస్తున్నారు.  ప్రమాదం జరిగిన వెంటనే ఒక వ్యాపారికి గుండె పోటు రావటంతో ఆసుపత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది  వివరాలు తెలియాల్సి ఉంది
నగర పోలీసు కమిషనర్ క్రాంతి రాణా  టాటా మాట్లాడుతూ  మృతులు  బెజవాడకు చెందిన కాశీ, పిడుగురాళ్లకు చెందిన సాంబగా గుర్తించామని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసాం. ఫైర్ నిబంధనలు పాటించిన వారికే అనుమతులు ఇచ్చాం. ఉదయం టపాకాయలు దిగుమతి చేస్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు.

 

Tags: Fire accident in Gymkhana Grounds – Two killed..

Post Midle
Post Midle