పరవాడలో అగ్ని ప్రమాదం

అనకాపల్లి ముచ్చట్లు:


అనకాపల్లి జిల్లా పరవాడ ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫెర్రో కెమికల్స్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో.. ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. మంటల్ని అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. కేజీహెచ్కు తరలించారు.అనకాపల్లి జిల్లా పరవాడ పారిశ్రామిక పార్కులోని ఫెర్రో కెమికల్స్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. మంటలతో పాటు దట్టమైన పొగ అలముకొవడంతో ఊపిరాడక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇద్దరికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, ఈ ప్రమాదంపై ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ సేఫ్టీ వారు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

Tags: Fire accident in Paravada

Leave A Reply

Your email address will not be published.